క‌రోనా వైర‌స్‌.. ఈ పేరు చెబితేనే భ‌య‌ప‌డుతున్నారు. రోజురోజుకీ ఈ వ్యాధిగ్రస్తులు పెరిగిపోతున్నారు. జ్వరం, దగ్గు, శ్వాసకోశ ఇబ్బందులు ఈ వైరస్ సాధారణ లక్షణాలు. కానీ, ఇది అవయవాలు విఫలం కావడం, న్యుమోనియా లేదా మరణానికి కూడా దారితీసే ప్రమాదముంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కొంతమందికి కరోనా వైరస్ లక్షణాలు కనిపిస్తున్నాయి. అయితే, ఇప్పటి వరకు దీనికి ఎటువంటి వాక్సిన్ అందుబాటులో లేదు. కాబట్టి దీన్ని అరికట్టాలంటే ఈ వ్యాధి సోకినవారి నుంచి ఇతరులకు సోకకుండా జాగ్రత్త పడటమే మార్గం.

 

చలికాలంలో ఈ వైరస్‌ వ్యాప్తి ఎక్కువగా ఉంటుంది. అయితే క‌రోనా భారిన ప‌డ‌కుండా జాగ్ర‌త్త‌లు తీసుకుంటే చాలా ఉత్త‌మం అంటున్నారు నిపుణులు. అందులో ముఖ్యంగా ఏసీలను ఆపేసి ఫ్యాన్లను వాడాలంటూ చెప్తున్నారు. చేతులను శుభ్రంగా కడుక్కోవటం ఫ్యాన్లను వాడి తాజా గాలిలోఉండటం ద్వారా కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టవచ్చని వారు తెలుపుతున్నారు. కరోనా వ్యాధిని నిరోధించటానికి ఉష్ణోగ్రత 30 డిగ్రీల సెంటిగ్రేడు కు పైన… గాలిలో తేమ శాతం 80 కి పైగా ఉన్న వాతావారణం ఉత్తమం అని తాజా ఆధ్యాయ‌నంలో తేలింది. అలాగే ఎవరికైనా కరోనా సోకిందని అనుమానం ఉన్నవారు తమ గది తలుపులు కిటికీలను తెరిచి ఉంచాలని నిపుణిలు తెలిపారు. 

 

సూర్యుని నుంచి వచ్చే అల్ట్రా వయొలెట్ కిరణాలు కరోనా వైరస్ను చంపగలవని ఉదయం సమయంలో కొంచెం సేపు సూర్యకాంతి లో నిలబడితే మంచింది. కాగా, కరొనా వైరస్ అనేది కొన్ని వైరస్‌ల సమూహం అని చెప్పొచ్చు. దీని గురించి కొన్ని మాటల్లో చెప్పాలంటే.. కొన్ని కరొనా వైరస్‌లు జంతువులకు మాత్రమే వ్యాపిస్తాయి.. కానీ, ఇందులోనే కొన్ని వైరస్‌లు మానవులను కూడా ప్రభావితం చేస్తాయి. ఇది వ్యాపించిందంటే చాలు.. శ్వాస సంబంధిత ఇన్ఫెక్షన్లు తలెత్తుతాయి. ఇదే ప్రభావం తీవ్రమైతే న్యూమోనియా వంటి అనేక ఇతర ఆరోగ్య సమస్యలకు కూడా కారణం అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: