ప్ర‌స్తుత జ‌న‌రేష‌న్‌లో కొలెస్ట్రాల్, బెల్లీ ఫ్యాట్‌లు అంద‌రినీ వేధిస్తున్న స‌మ‌స్యలుగా ఉన్నాయి. దీనికి కార‌ణం స‌రైన ఆహార నియ‌మాలు పాటించ‌క‌పోవ‌డం, రెగ్యుల‌ర్‌గా వ్యాయామం చేయ‌క‌పోవ‌డం వ‌ల్ల బ‌రువు పెరిగిపోతున్నారు. ప్ర‌ధానంగా బెల్లీ ఫ్యాట్ చాలామందికి పెద్ద సమస్య. మీరు ఈ ఫ్యాట్ ను తగ్గించుకోవడానికి ఇది వరకే చాలా టిప్స్ ఫాలో అయి ఉంటారు. అయినా ఫలితం లేదా ? అయితే ఈ రోజు నుంచి కొన్ని చిట్కాలు పాటించండి. ఫ్యాట్ తగ్గించుకోండి. మీ స్టమక్ ను ప్లాట్ గా చేసుకోండి. కొన్ని రకాల ఫుడ్స్ ను బ్రేక్ ఫాస్ట్ గా లేదా స్నాక్స్ గా తీసుకోవడం వల్ల మీ బాడీకి అధిక కేలరీస్ అందడమేగాకుండా మీ బెల్లీ ఫ్యాట్ ఈజీగా కరిపోతుంది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..


- యాపిల్స్: యాపిల్స్ లో ఫైబర్స్, అనేక రకాల పోషకాలు పుష్కలంగా ఉంటాయి. కాబట్టి.. ఉదయం బ్రేక్ ఫాస్ట్ లో ఒక యాపిల్ తీసుకోవడం వల్ల ఎక్కువ సమయం ఆకలి అనిపించదు. దీనివల్ల అతిగా తినకుండా ఉండవచ్చు. అలాగే.. పొట్టలో పేరుకున్న ఫ్యాట్ ని యాపిల్ కరిగిస్తుంది. 


- ఓట్స్: ఓట్స్‌ కొవ్వును తగ్గించడంలో చాలా శక్తివంతంగా పని చేస్తుంది. దీని ద్వారా రోజుకి 25 నుంచి 35 గ్రాముల ఫైబర్ పొంద‌వ‌చ్చు. కాబ‌ట్టి  ఓట్స్‌ను రెగ్యుల‌ర్‌గా తీసుకోవ‌డం వ‌ల్ల అధిక బ‌రువుకి చెక్ పెట్ట‌వ‌చ్చు.


- దోసకాయ : దోసకాయలో తక్కువ కాలరీలు ఉంటాయి. వీటిలో సుమారు 96 శాతం నీరు ఉంటుంది. ఒక దోసకాయలో కేవలం 45 కేలరీలు కలిగి ఉంటుంది. రెగ్యులర్ గా వీటిని రోజూ తీసుకోవడం వల్ల మీ బెల్లీ ఫ్యాట్ ఇట్టే కరిగిపోతుంది. 


- బాదం: ఇందులో ఉండే విటమిన్- ఈ, ప్రోటీన్స్ చర్మానికి ఎంతో ఉపయోగపడతాయి. అలాగే బాదంలో ఉండే ఫైబర్ దీర్ఘకాలంగా మీరు ఆరోగ్యంగా ఉండేందుకు ఉపయోగపడుతుంది. వీటి తీసుకోవడం వల్ల ఎక్కువ కేలరీల శక్తి వస్తుంది. కానీ ఫ్యాట్ ఏర్పడదు.


- అవెకాడో: అవెకాడోలో గుండె ఆరోగ్యంగా ఉండటానికి కావలసిన మోనో శ్యాచురేటెడ్ ఫ్యాట్ కలిగి ఉంటుంది. వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల శరీరంలో మంచి కొవ్వు పదార్థాలను పెంచి, చెడు కొవ్వు పదార్థాలను తగ్గిస్తాయి.


- బీన్స్: రెగ్యులర్ గా మనం తీసుకునే ఆహారంలో బీన్స్ తీసుకోవడం వల్ల బాడీ ఫ్యాట్ తగ్గుతుంది. జీర్ణక్రియను మెరుగు అవుతుంది. బీన్స్ చాలా సమయం వరకు ఆకలి కాకుండా చూస్తాయి. త్వరగా మీ బెల్లీ ఫ్యాట్ పోయి ఫ్యాట్ స్టమక్ వస్తుంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: