స‌హ‌జంగా పొగతాగడం మానేయడం అనేది మానవ నిగ్రహ శక్తికి ఉన్న పెద్ద సవాళ్లలో ఒకటి. ఇతర దురలవాట్ల లానే పొగతాగడం మానేయడం వల్ల‌ శరీరంలో వాస్తవ భౌతిక, మానసిక ప్రతికూల చర్యలు కలుగుతాయి. మనదేశంలో పొగాకు వాడకం వల్ల ప్రతి 8 నిమిషాలకు ఒకరు చనిపోతున్నారు. ఊపిరితిత్తుల క్యాన్సర్‌కి ముఖ్యకారణం ఇదే. పొగాకులో ఉండే కార్సినోజెనిక్ రసాయనాలు ఒక్కసారి పొగతాగినా ఊపిరితిత్తుల్లో మార్పులు తీసుకొస్తాయి. ఆ అలవాటు నుంచి శాశ్వతంగా విముక్తి పొంద‌డానికి మీకు అనేక పద్ధతులు ఉన్నాయి. అవి ఉప‌యోగిస్తే మీరు సులువుగా సిగ‌రెట్ మానేయ‌వ‌చ్చు. 


- నికోటిన్ కావాలనే కోరికను వ్యాయామం తగ్గిస్తుంది. మానేయడం వలన కలిగిన కొన్ని లక్షణాలను తగ్గిస్తుంది. మీకు సిగరెట్ కావాలని అనిపించినప్పుడు, దానికి బదులుగా షూ వేసుకొని రన్నింగ్ కు వెళ్ళండి లేదా ఉన్నచోటే కాసేపు పరిగెత్తండి.


- బేకింగ్ సోడా మూత్రంలో పీహెచ్ ను పెంచుతుంది. దీనివలన శరీరంలో అప్పటికే ఉన్న నికోటిన్ బయటకు వెళ్ళే ప్రక్రియ మెల్లగా జరుగుతుంది. దీని ఫలితంగా నికోటిన్ మీద పెద్దగ కోరిక పుట్టదు. 


- సిగ‌రెట్ మానేయాల‌నుకుంటే కొన్ని రోజులు నీరు, ఇత‌ర ద్ర‌వ ప‌దార్థాలు ఎక్కువ తీసుకోవాలి. వీటి వ‌ల్ల శ‌రీరంలో విష ప‌దార్థాలు బ‌య‌ట‌కు వెళ్లిపోతాయి.


- పళ్ళు, కాయగూరలు, పాలు, ఆకుకూరలు, క్యారెట్, పళ్ళు, కూరగాయలు పొగ తాగడానికి ముందు తీసుకున్నట్లయితే, చేదుగా ఉండే రుచితో అది నోటిలో వదిలే భయానక రుచి వల్ల‌ పొగాతాగడాన్ని సగంలోనే వదిలేసేటట్టు చేస్తుంది.


- స్నేహితులు లేదా కుటుంబ సభ్యులు సిగ‌రెట్ మానేయదలచుకుంటే, కలసి మానేద్దామని సూచించండి. వారి ప్రోత్సాహం, సంఘీభావం వలన ఎంతో తేడా రావచ్చు.


- నారింజ, నిమ్మ, ఉసిరి, జామ ఎక్కువగా తీసుకోవడం వలన పొగాతాగాలనే కోరికను తగ్గిస్తుంది. కారణం సిగరెట్ వల్ల‌ మీరు విటమిన్ సి కు దూరంగా ఉండి ఉంటారు, నికోటిన్ మీలో నిండి మిమ్మల్ని, దీని లోపానికి గురి చేసి ఉంటుంది.


- ఉప్పగా ఉండే చిప్స్, అప్పడాలు, పచ్చళ్ళ వంటివి మీకు పొగ తాగాలనే కోరిక పుట్టినప్పుడు తినవచ్చు. మీరు నాలుక కొన మీద కొంత ఉప్పును కూడా పెట్టుకోవచ్చు. మీ పొగతాగాలనే కోరికను ఇది చంపేస్తుంది.


- చక్కెర లేని క్యాండి లేదా చూయింగ్ గమ్ వంటివి మీ నోటిని బిజీగా ఉంచి, మిమ్మల్ని పొగతాగాలనే కోరిక నుండి దూరంగా ఉంచుతాయి.
ఇలా క్ర‌మ‌క్రమంగా వీట‌ని పాటిస్తూ మీరు సిగ‌రెట్ వ్య‌స‌నానికి దూరం అవ్వొచ్చు. మీ జీవితంలో బాగా కష్టమైనవైనప్పటికి మీరు సాధించిన పనులను తలచుకోండి. సిగ‌రెట్ వ్య‌స‌నం నుంచి బ‌య‌ట ప‌డండి.


మరింత సమాచారం తెలుసుకోండి: