గుంటూరు జిల్లాలో అధికార వైసీపీకి అనుకూలమైన నియోజకవర్గాల్లో గుంటూరు ఈస్ట్ ఒకటి. 2008 నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా ఏర్పడిన ఈ గుంటూరు ఈస్ట్‌లో వైసీపీ రెండుసార్లు గెలిచింది. 2009 ఎన్నికల్లో ఇక్కడ కాంగ్రెస్ గెలిచింది. ముస్లిం ఓటర్లు అధికంగా ఉన్న ఈ నియోజకవర్గంలో ముస్లిం అభ్యర్ధులే పోటీ చేస్తూ వస్తున్నారు.

అయితే మొదట నుంచి ముస్లింలు వైఎస్సార్ ఫ్యామిలీని ఎక్కువగా అభిమానిస్తారు. అందుకే 2009లో ఇక్కడ కాంగ్రెస్ గెలిస్తే, 2014, 2019 ఎన్నికల్లో వైసీపీ గెలిచింది. వైసీపీ నుంచి రెండు పర్యాయాలు ముస్తఫా విజయం సాధిస్తూ వస్తున్నారు. రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచిన ముస్తఫా తనదైన శైలిలో పనిచేసుకుంటూ వెళుతున్నారు. నియోజకవర్గంలో ప్రజలకు అందుబాటులోనే ఉంటూ, వారికి అండగా ఉంటున్నారు. అలాగే ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఎమ్మెల్యే ముస్తఫాకు బాగా ప్లస్ అవుతున్నాయి.


కాకపోతే టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు గుంటూరు నగరం శరవేగంగా అభివృద్ధి చెందింది. కానీ ఇప్పుడు అభివృద్ధి అంతంత మాత్రమే. పైగా దగ్గరే ఉన్న రాజధాని అమరావతికి వైసీపీ షాక్ ఇచ్చి, మూడు రాజధానులు పెట్టాలని డిసైడ్ అయింది. దీంతో గుంటూరులో అభివృద్ధికి బ్రేక్ పడింది.

అయితే అమరావతి అంశం ఇప్పుడు కాకపోయిన నెక్స్ట్ ఎన్నికల్లో వైసీపీ ఎమ్మెల్యేలకు ఇబ్బందే అవుతుంది. కాకపోతే వైసీపీ అధికారంలో ఉండటంతో, మొన్న ఆ మధ్య జరిగిన గుంటూరు కార్పొరేషన్ ఎన్నికలో ఆ పార్టీ సత్తా చాటింది. ఈస్ట్ నియోజకవర్గంలో వైసీపీ క్లీన్‌స్వీప్ చేసేసింది. కానీ నెక్స్ట్ సాధారణ ఎన్నికల్లో అమరావతి ఎఫెక్ట్ ముస్తఫాపై బాగా పడే ఛాన్స్ ఉంది.

అటు టీడీపీ తరుపున నజీర్ కూడా యాక్టివ్‌గా పనిచేస్తున్నారు. ఈస్ట్‌లో నజీర్‌కు కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. పైగా ఇక్కడ టీడీపీకి వరుసగా మూడుసార్లు ఓడిపోయిందనే సానుభూతి ఉంది. ఈ సానుభూతి, అమరావతి అంశం నజీర్‌కు ప్లస్ అయ్యే ఛాన్స్ ఉంది. మొత్తానికైతే ముస్తఫాకు మూడోసారి గెలవడం మాత్రం కాస్త కష్టమే అని చెప్పొచ్చు.


మరింత సమాచారం తెలుసుకోండి: