గుంటూరు జిల్లాలో కమ్మ సామాజికవర్గం ప్రభావం కాస్త ఎక్కువగానే ఉంటుంది...అందులో ముఖ్యంగా పెదకూరపాడు నియోజకవర్గంలో రాజకీయంగా కమ్మ నేతలదే హవా. టీడీపీలో కమ్మ నేతలదే పెత్తనం. గత కొన్నేళ్లుగా వారే రాజకీయం చేస్తూ వస్తున్నారు. 2009, 2014 ఎన్నికల్లో ఇక్కడ టి‌డి‌పి నేత కొమ్మాలపాటి శ్రీధర్ ఎమ్మెల్యేగా గెలిచారు. కమ్మ వర్గానికి చెందిన నేత కావడంతో శ్రీధర్‌కు నియోజకవర్గంపై పట్టు ఎక్కువ. అయితే కమ్మ నేతకు...అదే కమ్మ నేతతో చెక్ పెట్టాలని, 2019 ఎన్నికల్లో వైసీపీ తరుపున నంబూరు శంకర్ రావుని బరిలో దించారు.

ఇక జగన్ గాలిలో శంకర్ రావు..దాదాపు 14 వేల ఓట్ల మెజారిటీతో శ్రీధర్‌పై గెలిచారు. తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన శంకర్ రావు...తనదైన శైలిలో పనిచేసుకుంటూ ముందుకెళుతూ, ప్రజా సమస్యలని పరిష్కరించడానికి కృషి చేస్తున్నారు...అర్హులైన వారికి సంక్షేమ పథకాలు అందేలా చేస్తున్నారు...అలాగే నియోజకవర్గంలో ప్రభుత్వం తరుపున జరిగే కార్యక్రమాలు జరుగుతున్నాయి...నాడు-నేడు ద్వారా పాఠశాలల అభివృద్ధి, జగనన్న కాలనీల పేరిట పేదలకు ఇళ్ళు కట్టించే కార్యక్రమం...కొత్తగా సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాల నిర్మాణాలు జరిగాయి. ఇక మీకోసం- మీ ఎమ్మెల్యే అనే కార్యక్రమం ద్వారా శంకర్ రావు...ప్రజల్లోకి వెళుతూ, వారి సమస్యలని తెలుసుకుని వాటిని పరిష్కరించడానికి కృషి చేస్తున్నారు. అయితే రెండున్నర ఏళ్లలో శంకర్ రావు పర్వాలేదనిపించేలా పనిచేస్తున్నారు...అలాగే ఈయన ఎలాంటి వివాదాల జోలికి కూడా వెళ్లలేదు. అక్రమాలు చేసినట్లు ఆరోపణలు తెచ్చుకోలేదు.


అటు టి‌డి‌పి తరుపున శ్రీధర్ సైతం దూకుడుగా పనిచేస్తున్నారు...మళ్ళీ పెదకూరపాడులో టి‌డి‌పి జెండా ఎగరవేయాలనే లక్ష్యంతో ముందుకెళుతున్నారు...ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్నారు. అయితే అనుకున్న మేర శ్రీధర్‌కు నియోజకవర్గంపై పట్టు పెరగలేదని తెలుస్తోంది. అలాగే ఈయన నెక్స్ట్ ఎన్నికల్లో సేఫ్ సైడ్‌గా గుంటూరు వెస్ట్‌లో పోటీ చేయడానికి రెడీ అవుతున్నారని ప్రచారం కూడా జరుగుతుంది. మొత్తానికైతే టి‌డి‌పి కమ్మ నేతకు వైసీపీ కమ్మ ఎమ్మెల్యే పెద్దగా ఛాన్స్ ఇవ్వడం లేదనే చెప్పొచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: