జగన్ మంత్రివర్గంలో పవర్‌ఫుల్ మంత్రులు చాలా తక్కువ మంది ఉన్నారు. అలాంటి మంత్రుల్లో బాలినేని శ్రీనివాసరెడ్డి ఒకరని చెప్పొచ్చు. అసలు డైరక్ట్‌గా జన్‌ని కలవగలిగే కెపాసిటీ బాలినేనికి ఉంది. ఎలాగో బంధువు కాబట్టి జగన్‌కు అత్యంత సన్నిహితుడుగా బాలినేని ఉన్నారు. ఇక ఈయన క్యాబినెట్‌లో విద్యుత్, అటవీశాఖ మంత్రిగా ఉన్నారు. ఇక విద్యుత్ విషయంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయో అందరికీ తెలిసిందే.

సోలార్ విద్యుత్ కొనుగోలు అంశం ఎంత వివాదామైందో తెలిసిందే. అలాగే బొగ్గు ఆధారిత జెన్కో విద్యుదుత్పత్తి కేంద్రాలను షట్‌డౌన్‌ చేసి,  బొగ్గు కొనుగోళ్లను నిలిపివేయాలనే నిర్ణయం తీసుకోవడం జరిగాయి. అయితే ఈ నిర్ణయాల విషయంలో బాలినేనికి పెద్ద అవగాహన లేదని పలు మీడియా సంస్థలు కథనాలు ఇచ్చాయి. విద్యుత్ శాఖని ఒక అధికారి నడిపిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. ఇక అటవీ శాఖ విషయంలో బాలినేని యాక్టివ్ గానే ఉన్నారట. వన మహోత్సవాలు నిర్వహించడం, సమీక్షా సమావేశాలు పెట్టడంలో ముందున్నారు. ఇక పార్టీ పరమైన అంశాల్లో బాలినేనికి బాగా పట్టు ఉంది. ప్రకాశం జిల్లాలో ఏదైనా ఈయనే హ్యాండిల్ చేస్తారు. ప్రతిపక్షాలకు కౌంటర్లు ఇవ్వడంలో దూకుడుగా ఉంటారు.

ఇటు ఎమ్మెల్యేగా వస్తే...ఒంగోలు నియోజకవర్గంలో బాలినేని అభివృద్ధి కార్యక్రమాలు బాగానే చేస్తున్నారు. సంక్షేమ పథకాల అమలులో ఎలాంటి ఇబ్బందులు లేవు. అయితే మంత్రిగా ఇంకా అభివృద్ధి చేయొచ్చు...కానీ ఆ స్థాయిలో మాత్రం అభివృద్ధి జరగడం లేదనే అసంతృప్తి ప్రజల్లో ఉన్నట్లు కనిపిస్తోంది. కానీ సమస్య అంటూ వచ్చే ప్రజలకు అండగా నిలవడంలో బాలినేని ముందున్నారు.

అయితే ఒంగోలు పట్టణంలో తాగునీటి సమస్య కాస్త ఎక్కువగా ఉంది. వెలిగొండ ప్రాజెక్టు పూర్తి అయితే ఈ సమస్య తగ్గుతుంది. అయితే పట్టణంలో రోడ్ల పరిస్తితి కూడా సరిగ్గా లేదు. అక్కడక్కడ గుంతలు వల్ల ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు.  డ్రైనేజ్ సమస్యలు ఉన్నాయి. ముర్గునీటికి దోమలు పెరిగి ప్రజల ఆరోగ్యం పాడవుతుంది.

రాజకీయంగా వస్తే బాలినేనికి ఒంగోలులో తిరుగులేదు. ఇప్పటికే అయిదుసార్లు ఎమ్మెల్యీగా గెలిచి...ఒంగోలుపై గ్రిప్ తెచ్చుకున్నారు. ప్రస్తుతం ఒంగోలులో బాలినేనికి తిరుగులేదు. బాలినేనికి చెక్ పెట్టడానికి టీడీపీ నేత దామచర్ల జనార్ధన్ చెక్ పెట్టడానికి చూస్తున్నారు...కానీ అంత సులువుగా బాలినేనికి చెక్ పెట్టడం కష్టం.


మరింత సమాచారం తెలుసుకోండి: