వైఎస్సార్ చనిపోయాక జగన్ వైసీపీ పెట్టి...ఉమ్మడి ఏపీలో బలమైన పార్టీగా మలుచుకున్న విషయం తెలిసిందే. 2014 వరకు ఏపీ, తెలంగాణల్లో వైసీపీకి బలమైన నాయకత్వం ఉంది...కానీ రాష్ట్ర విభజన జరిగాక జగన్, తెలంగాణని వదిలేశారు. దీంతో అక్కడ ఉన్న బలమైన నాయకులు కూడా వైసీపీని వదిలేశారు. అయితే అందులో చాలామంది జగన్ సన్నిహితులు కూడా ఉన్నారు. తప్పనిసరి పరిస్తితుల్లో వారు వైసీపీని వదిలేశారు. అలా వైసీపీని వదిలేసిన వారిలో బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి కూడా ఒకరు.

ఈయన గతంలో కాంగ్రెస్‌లో పనిచేశారు. 1999లో ఆర్మూర్ ఎమ్మెల్యేగా, 2004లో బాన్సువాడ ఎమ్మెల్యేగా పనిచేశారు. ఇక 2009లో వైఎస్సార్ చనిపోయాక జగన్ వెంట నడిచారు. జగన్ పెట్టిన వైసీపీలో పనిచేశారు. కానీ తెలంగాణలో వైసీపీ పని అయిపోవడంతో ఆయన టీఆర్ఎస్‌లోకి వెళ్ళి 2014లో నిజామాబాద్ రూరల్ నుంచి గెలిచి ఎమ్మెల్యే అయ్యారు. కాంగ్రెస్ సీనియర్ నేత డి.శ్రీనివాస్‌పై విజయం సాధించారు. 2018లో కూడా అదే స్థానం నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. దాదాపు 30 వేల మెజారిటీతో గెలిచారు.

ఇలా వరుసగా గెలిచిన బాజిరెడ్డి...టీఆర్ఎస్‌లో దూసుకెళుతున్నారు. మంత్రి పదవి రాకపోయినా సరే..బాజిరెడ్డికి ఆర్టీసీ ఛైర్మన్ పదవి దక్కింది. ఆర్టీసీ ఛైర్మన్‌గా కూడా బాగానే పనిచేస్తున్నారు. అలాగే ఎమ్మెల్యేగా తన నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ముందుకెళుతున్నారు...ఇక ప్రజలకు ఎప్పుడు టచ్‌లో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారు.

రాజకీయంగా చూస్తే బాజిరెడ్డి బలంగానే ఉన్నారు..కానీ నిజామాబాద్ రూరల్‌లో బీజేపీతో కాస్త ఇబ్బందులు ఉన్నాయి. 2018 ఎన్నికల్లో బాజిరెడ్డి గెలిచినా సరే..2019 పార్లమెంట్ ఎన్నికల్లో నిజామాబాద్ పార్లమెంట్‌లో బీజేపీ గెలిచింది. అప్పుడు నిజామాబాద్ రూరల్‌లో టీఆర్ఎస్ కంటే బీజేపీకి ఎక్కువ మెజారిటీ వచ్చింది. ఇక నెక్స్ట్ ఎన్నికల్లో రూరల్‌లో సత్తా చాటాలని బీజేపీ చూస్తుంది. ఎంపీ అరవింద్ సైతం, బాజిరెడ్డికి చెక్ పెట్టాలని చూస్తున్నారు. అటు కాంగ్రెస్ సైతం ఇక్కడ బలంగానే ఉంది. మరి రెండు పార్టీలని దాటుకుని బాజిరెడ్డి మళ్ళీ గెలుస్తారో లేదో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: