తెలంగాణలో మళ్ళీ కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లడానికి రెడీగానే ఉన్నట్లు కనిపిస్తున్నారు...పైకి మాత్రం ముందస్తు ఎన్నికలకు వెళ్ళే ఆలోచన లేదని చెబుతున్నా సరే...వెనుక మాత్రం వెళ్లడానికి వ్యూహాలు రెడీ చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రతిపక్షాలు సైతం ముందస్తు ఎన్నికలపై రెడీగానే ఉన్నాయి. తెలంగాణలో ఖచ్చితంగా ముందస్తు ఎన్నికలు జరుగుతాయని ప్రతిపక్షాలు చెబుతున్నాయి.

అందుకు తగ్గట్టుగానే కేసీఆర్ రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది..ఈ క్రమంలోనే ఎన్నికల టీంలో భాగంగా మంత్రివర్గ విస్తరణ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సారి కీలకమైన నేతలకు పదవులు ఇచ్చే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతుంది. ఈ క్రమంలోనే సీనియర్ నేత దాస్యం వినయ్ భాస్కర్ సైతం ఈ సారి క్యాబినెట్‌లో ఛాన్స్ దక్కించుకునే అవకాశాలు ఉన్నాయని ప్రచారం వస్తుంది.

అయితే వినయ్ భాస్కర్...తన అన్న ప్రణయ్ భాస్కర్ బాటలో రాజకీయాల్లోకి వచ్చారు. గతంలో ప్రణయ్ టీడీపీలో పనిచేశారు. ఎన్టీఆర్ క్యాబినెట్‌లో మంత్రిగా కూడా పనిచేశారు. ఇక ఆయన చనిపోయాక వినయ్ రాజకీయాల్లోకి వచ్చారు. 1999, 2004 ఎన్నికల్లో హనుమకొండ నుంచి ఇండిపెండెంట్‌గా పోటీ చేసి ఓడిపోయారు. ఇక తర్వాత ఆయన టీఆర్ఎస్‌లో చేరారు. 2009లో టీఆర్ఎస్ నుంచి వరంగల్ వెస్ట్‌లో పోటీ చేసి గెలిచారు. ఆ వెంటనే తెలంగాణ ఉద్యమంలో భాగంగా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి 2010 ఉపఎన్నికలో పోటీ చేసి మళ్ళీ గెలిచారు.

ఇక తెలంగాణ వచ్చాక 2014, 2018 ఎన్నికల్లో వరుసగా గెలిచారు. సీనియర్ ఎమ్మెల్యేగా వరంగల్ నగరంలో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు. హైదరాబాద్ తర్వాత తెలంగాణలో బాగా అభివృద్ధి జరిగే నగరాల జాబితాలో వరంగల్ ముందుంది. కేటీఆర్ సహకారంతో వరంగల్‌లో ఐటీ హబ్‌ని కూడా తీసుకొచ్చారు. రోడ్లు, తాగునీరు సమస్యలు లేకుండా చూసుకుంటున్నారు.

రాజకీయంగా వెస్ట్‌లో వినయ్ చాలా స్ట్రాంగ్‌గా ఉన్నారు. ఇక్కడ కాంగ్రెస్, బీజేపీలు వీక్‌గానే ఉన్నాయి. త్వరలోనే వినయ్‌కు మంత్రి పదవి వచ్చే అవకాశాలు ఉన్నాయి. మంత్రి పదవి వస్తే వెస్ట్‌లో వినయ్‌కు తిరుగుండదు.


మరింత సమాచారం తెలుసుకోండి: