గత ఎన్నికల నుంచి కృష్ణా జిల్లా రాజకీయాల్లో బాగా వార్తల్లో ఉంటున్న నియోజకవర్గం ఏదైనా ఉందంటే అది గన్నవరం మాత్రమే..మామూలుగా టీడీపీ నుంచి గెలిచిన వల్లభనేని వంశీ టీడీపీలోనే కొనసాగితే గన్నవరం గురించి చర్చ వచ్చేది కాదు...ఎప్పుడైతే ఆయన వైసీపీ వైపుకు వెళ్లారో అప్పటినుంచి సీన్ మారిపోయింది. ఏదొక సందర్భంలో గన్నవరం గురించి చర్చ వస్తూనే ఉంది...ఎప్పుడైతే వంశీ వైసీపీ వైపు వచ్చారో అప్పటినుంచి గన్నవరం వైసీపీలో రచ్చ మొదలైంది...వైసీపీ రాకని అసలైన వైసీపీ కార్యకర్తలు అంగీకరించలేకపోయారు.

కానీ జగన్‌కు సన్నిహితంగా ఉండటం, కొడాలి నాని స్నేహితుడు కావడంతో వంశీని అంగీకరించక తప్పలేదు..అయితే అక్కడ పోటీ చేసి ఓడిపోయిన దుట్టా రామచంద్రరావు, యార్లగడ్డ వెంకట్రావు సైతం వంశీ రాకని ఒప్పుకోలేదు...అయితే వైసీపీలోకి వచ్చాక వంశీ డామినేషన్ పెరిగిపోయింది..దీంతో దుట్టా, యార్లగడ్డ సైడ్ అవ్వాల్సి వచ్చింది. ఇక వారు సైడ్ అయ్యాక వంశీకి ఎలాంటి ఇబ్బంది ఉండదని అంతా అనుకున్నారు. అయితే తాజాగా ఓ ట్విస్ట్ వచ్చి పడింది..గన్నవరంకు చెందిన కొందరు వైసీపీ కార్యకర్తలు ఏకంగా విజయసాయిరెడ్డిని కలిసి వంశీకు సీటు ఇవ్వొద్దని, గన్నవరం సీటుకు ఇంచార్జ్‌ని పెట్టాలని కోరారు.

తాము పార్టీ పెట్టిన దగ్గర నుంచి ఉంటున్నామని, తమని వంశీ నానా రకాలుగా ఇబ్బందులు పెట్టారని, ఆఖరికి వైసీపీలోకి వచ్చాక ఇబ్బందులకు గురి చేశారని చెప్పి కార్యకర్తలు విజయసాయిరెడ్డి ముందు వాపోయారు. ఇక వారు ఇలా విజయసాయికి ఫిర్యాదు చేయడంతో గన్నవరం సీటు విషయంలో ట్విస్ట్ వచ్చి పడింది. ఇప్పుడు అక్కడ వంశీని కాదని, వేరే నాయకుడుకు ఇంచార్జ్ పదవి ఇస్తారనేది తెలియడం లేదు.

అయితే ఇప్పుడున్న పరిస్తితుల్లో గన్నవరంలో వంశీని దాటి వేరే వాళ్ళకు సీటు ఇవ్వడం జరిగే పని కాదు..ఇంకా చెప్పాలంటే వంశీకి సీటు రాకుండా ఎవరు ఆపలేరని చెప్పొచ్చు...ఓ వైపు జగన్‌తో అనుబంధం ఉంది...మరోవైపు కొడాలికి సన్నిహితుడు, అలాగే సొంత ఇమేజ్ ఉన్న నాయకుడు...కాబట్టి వంశీ సీటుకు ఎలాంటి ఇబ్బంది ఉండదని చెప్పొచ్చు.


మరింత సమాచారం తెలుసుకోండి: