2019 లో అధికారం కోల్పోయాక టీడీపీ అధినేత చంద్రబాబుకు అచ్చెన్నాయుడు, నిమ్మల రామానాయుడులు రెండు భుజాలుగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఏ విషయంలోనైనా, ఏ పోరాటంలోనైనా ఈ ఇద్దరు నేతలు బాబుకు అండగా నిలుస్తూ వచ్చారు. అలాగే అసెంబ్లీలో కూడా ఈ ఇద్దరు నేతలు అధికార వైసీపీని ధీటుగా ఎదురుకోవడంలో బాబుకు సపోర్ట్ ఉన్నారు. అయితే ఇందులో పాలకొల్లు నుంచి రెండో సారి ఎమ్మెల్యేగా గెలిచిన రామానాయుడు ఓ వైపు బాబుకు మద్దతుగా ఉంటూనే, మరోవైపు తన నియోజకవర్గంలో నిత్యం ఏదొక సమస్య పరిష్కారానికి కృషి చేస్తున్నారు.

 

 

ఎప్పుడైనా పార్టీ సమావేశాలు, అసెంబ్లీ సమావేశాలు ఉన్నప్పుడు మినహా మిగతా సమయాల్లో నియోజకవర్గంలోనే ఉంటున్నారు.  ప్రతిపక్షంలో ఉన్నా ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ, వారి సమస్యల పట్ల వెంటనే స్పందిస్తున్నారు. అసలు రోజూ ఖాళీ లేకుండా నియోజకవర్గంలో ఏదొక ప్రాంతంలో పర్యటిస్తూనే ఉన్నారు. అయితే ప్రతిపక్ష ఎమ్మెల్యేగా పెద్దగా నిధులు రాకపోయినా తనకు సాధ్యమైన పనులు చేస్తున్నారు. అలాగే అధికారులకు చెప్పుకుని పలు సమస్యలు పరిష్కరించారు.

 

ఇక తాజాగా కరోనా మహమ్మారి ప్రభావం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో, ప్రజలకు అండగా ఉంటున్నారు. కరోనా వ్యాప్తి పట్ల ప్రజలని అప్రమత్తం చేస్తూనే, నియోజకవర్గాన్ని పరిశుభ్రం చేసుకుంటున్నారు. అలాగే లాక్ డౌన్ వల్ల ఇబ్బందులు పడుతున్న ప్రజలకు నిత్యావసర వస్తువులు, కూరగాయలు ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. అదేవిధంగా నియోజకవర్గంలో రైతుల సమస్యలని ప్రభుత్వం ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేసున్నారు. ముఖ్యంగా ఆక్వా రైతుల కోసం పోరాటం కూడా చేస్తున్నారు.

 

ఇలా నియోజకవర్గంలోనే సమస్యలపైనే కాకుండా అధికార వైసీపీని పలు సమస్యలపై ప్రశ్నించడంలో కూడా ముందున్నారు. అయితే రామానాయుడుకు ప్రతిపక్షంలో ఉండటం ఇబ్బందిగా మారింది. ఇదే సమయంలో ఇక్కడ వైసీపీ ఇన్ ఛార్జ్ శ్రీను అన్ని పనులు చేయిస్తున్నారు. తమ ప్రభుత్వం సహకారంతో  ప్రజల సమస్యల పరిష్కరించేందుకు కృషి చేస్తున్నారు. ఇక దీని వల్ల నిమ్మలకు కాస్త అనుకూల వాతావరణం లేకుండా పోయింది. కానీ నిమ్మల ప్రతిపక్షంలో ఉన్నా ఖాళీ లేకుండా పని చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: