ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా దెందులూరు నియోజ‌క‌వ‌ర్గం పేరు చెపితేనే గ‌త ప‌దేళ్ల‌లో స‌మైక్య రాష్ట్రంలో మార్మోగిపోయింది. ఇక్క‌డ ఏదో ప్ర‌పంచ స్థాయి వింత‌లు ఏమీ లేవు సుమా... చింత‌మ‌నేని ప్ర‌భాక‌ర్ అనే కాంట్ర‌వ‌ర్సీ ఎమ్మెల్యే చేసే ప‌నులతో ప్ర‌భాక‌ర్ పేరు ఎప్పుడూ వార్త‌ల్లో ఉండేది. ఎప్పుడూ ఎవ‌రో ఒక‌రిని తిట్ట‌డ‌మో లేదా ?  కొట్ట‌డంతోనో ?  ప్ర‌భాక‌ర్ హైలెట్ అయ్యేందుకు ఇష్ట‌ప‌డినా చంద్ర‌బాబు కిమ్మ‌న‌కుండా స‌పోర్ట్ చేస్తూ వ‌చ్చారు. ప్ర‌భాక‌ర్ చంద్ర‌బాబు సొంత సామాజిక వ‌ర్గానికి చెందిన వ్య‌క్తి కావ‌డంతో బాబుతో పాటు పార్టీ నేత‌లు కూడా ఆయ‌న ఎన్ని ఆగ‌డాలు చేసినా స‌హిస్తూ, భ‌రిస్తూ వ‌చ్చారు.

 

ఒక‌నొక ద‌శ‌లో ప్ర‌భాక‌ర్‌లో మితిమీరిన గ‌ర్వం హెచ్చుమీర‌డంతో న‌న్ను ప‌వ‌న్‌, జ‌గ‌న్ క‌లిసి వ‌చ్చినా ఓడించ‌లేరని స‌వాల్ విసిరారు. అయితే ప్ర‌భాక‌ర్‌కు రాజ‌కీయ ఓన‌మాలు నేర్పిన కొఠారు కుటుంబానికే చెందిన కొఠారు అబ్బ‌య్య చౌద‌రి ఎన్నిక‌ల‌కు ముందు వ‌ర‌కు యూర‌ప్‌, యూకే వైసీపీ క‌న్వీన‌ర్‌గా ఉండి అక్క‌డ పార్టీని ప‌టిష్టం చేశారు. జ‌గ‌న్‌కు కొన్నేళ్ల నుంచే అత్యంత స‌న్నిహితంగా ఉన్న అబ్బ‌య్య చౌద‌రి దెందులూరులో ఎంట్రీ ఇచ్చేవ‌ర‌కు అక్క‌డ పార్టీని పట్టించుకున్న నాథుడే లేడు. అబ్బ‌య్య చౌద‌రి వైసీపీ క‌న్వీన‌ర్ అయిన వెంట‌నే పార్టీ కోసం ఎంతో క‌ష్ట‌ప‌డ్డారు. ప్ర‌భాక‌ర్ త‌న అనుచ‌రుల‌పై పెట్టిన కేసుల‌ను ధైర్యంగా ఎదుర్కొని పోరాటం చేసి చివ‌ర‌కు విజ‌యం సాధించారు.

 

ఇక గ‌తేడాది ఎన్నిక‌ల్లో ప్ర‌భాక‌ర్‌పై ఉన్న తీవ్ర వ్య‌తిరేక‌త‌, అబ్బ‌య్య చౌద‌రి వ్య‌క్తిత్వం, జ‌గ‌న్ వేవ్ క‌ల‌వ‌డంతో దెందులూరులో అబ్బ‌య్య 17 వేల ఓట్ల మెజార్టీతో తిరుగులేని విజ‌యం సాధించారు. ఎమ్మెల్యేగా యేడాది పాల‌న పూర్తి చేసుకుంటోన్న అబ్బ‌య్య చౌద‌రి పాల‌న ఎలా ఉందో ?  హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్ రిపోర్టులో చూద్దాం.

 

మార్నింగ్ వాక్ హైలెట్ :
నియోజ‌క‌వ‌ర్గంలో ప్ర‌జా స‌మ‌స్య‌లు తెలుసుకుని వాటిని ప‌ర్య‌వేక్షించేందుకు అబ్బ‌య్య చౌద‌రి మార్నింగ్ వాక్ కార్య‌క్ర‌మానికి శ్రీకారం చుట్టారు. ప్ర‌తి రోజు నియోజ‌క‌వ‌ర్గంలో ఏదో ఒక గ్రామంలో ప‌ర్య‌టిస్తూ అక్క‌డ స‌మ‌స్య‌లు తెలుసుకుని వాటిని ప‌రిష్క‌రిస్తున్నారు. ఇక అభివృద్ధి ప‌రంగా చూస్తే నియోజ‌క‌వ‌ర్గంలో ర‌హ‌దారులు, తాగునీటికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇక నియోజ‌క‌వ‌ర్గంలో పార్టీల‌తో సంబంధం లేకుండా ఎవ‌రు వ‌చ్చినా ప‌నులు చేయ‌డంతో అబ్బ‌య్య చౌద‌రికి పార్టీల‌కు అతీతంగా మంచి మార్కులు ప‌డుతున్నాయి. ఇక రు.300 కోట్ల‌తో కొల్లేరులో రెగ్యులేట‌ర్ ఏర్పాటుకు ఆయ‌న ప‌డిన క‌ష్టం మేజ‌ర్ హైలెట్‌. అలాగే నియోజ‌క‌వ‌ర్గంలో వేలాది హెక్టార్ల‌లో సాగు అవుతోన్న ఫామాయిల్ రైతుల కోసం రేటు పెంపు విష‌యంలో ఆయ‌న ఏలూరు ఎంపీ కోట‌గిరి శ్రీథ‌ర్‌తో క‌లిసి ఎంతో పోరాటం చేసి స‌క్సెస్ అయ్యారు. ఇది రైతుల్లో ఆయ‌న‌కు మంచి పేరు తెచ్చిపెట్టింది. 

 

ప్థానిక ఎన్నిక‌లు వార్ వ‌న్‌సైడేనా..
నియోజ‌క‌వ‌ర్గంలో ప్ర‌భాక‌ర్ ఎన్నిక‌ల సంగ్రామానికి ముందే చేతులు ఎత్తేసిన‌ట్ల‌య్యింది. ప‌దేళ్ల పాటు ఎమ్మెల్యేగా ఉండి, విప్‌గా ప‌నిచేసి.. త‌న‌కు తాను టైగ‌ర్‌ను అని చెప్పుకునే వ్య‌క్తి ఈ రోజు త‌న నియోజ‌క‌వ‌ర్గంలో స్థానిక ఎన్నిక‌ల్లో పార్టీ త‌ర‌పున క్యాండెట్ల‌ను పెట్ట‌లేని దీన‌స్థితికి చేరిపోయాడు. ఇప్ప‌టికే ఏలూరు రూర‌ల్ మండ‌లం జ‌డ్పీటీసీ వైసీపీకి ఏవ‌గ్రీవం అయ్యింది. మండ‌ల స‌ర‌స్వ‌తి వైసీపీ నుంచి ఏక‌గ్రీవంగా ఎన్నిక‌య్యారు. ఇక ఏలూరు రూర‌ల్ మండ‌లంలో 3 ఎంపీటీసీలు, దెందులూరు మండ‌లం రామారావుగూడెం ఎంపీటీసీ వైసీపీకి ఏక‌గ్రీవ‌మ‌య్యాయి. 

 

ఇప్పుడు ప‌రిస్థితి ఎలా ఉందంటే నియోజ‌క‌వ‌ర్గంలో ఎన్నిక‌లు జ‌రిగిన చోట్ల కూడా టీడీపీ మొత్తంగా గెలిచే ఎంపీటీసీలు గాని, స‌ర్పంచ్‌లు గాని సింగిల్ డిజిట్ దాటే ప‌రిస్థితి లేదు. ఇక 84 పంచాయ‌తీలుంగా టీడీపీ సింగిల్ డిజిట్ దాటే ప‌రిస్థితి లేదు. చివ‌ర‌కు టీడీపీ వాళ్లు ఎన్నిక‌ల్లో పోటీ చేసే స‌త్తా లేక వైసీపీకి స‌ర్పంచ్ ప‌ద‌వి ఇస్తాం... మాకు ఉప స‌ర్పంచ్ ప‌ద‌వితో పాటు నాలుగు వార్డులు ఇవ్వాల‌ని ప్ర‌తిపాద‌న‌లు పెడుతున్నారు. ఎన్నిక‌లు జరిగినా గెలిచే ప‌రిస్థితి లేద‌నే వాళ్లు ఈ ప్ర‌తిపాద‌న‌లు పెడుతున్నారు. 

 

ఇక నియోజ‌క‌వ‌ర్గ టీడీపీలో ఫ‌స్ట్‌, సెకండ్ కేడ‌ర్ నాయ‌కులు ఇప్ప‌టికే వైసీపీలో జాయిన్ అయిపోయారు. ఈ నియోజ‌క‌వ‌ర్గంలో క‌మ్మ సామాజిక వ‌ర్గం అధిక ప్ర‌భావం చూపుతోంది. గ‌తంలో ప్రభాక‌ర్ వెంట ఉన్న టీడీపీ నేత‌లు చేసిన ప‌నుల‌కు బిల్లులే ఏకంగా రు. 250 కోట్ల వ‌ర‌కు రావాల్సి ఉంది. ఈ బిల్లుల కోసం ఇప్పుడు వాళ్లంతా టీడీపీలో ఉన్నా అబ్బ‌య్య చౌద‌రిని ప్ర‌స‌న్నం చేసుకునేందుకు ఆయ‌న వెంట ప్ర‌ద‌క్షిణ‌లు చేస్తున్నారు. మ‌రి కొంద‌రు మాత్రం మీకు స‌పోర్ట్ చేస్తాం... టైం చూసుకుని పార్టీ మ‌ర‌తాం.. మాకు సాయం చేసిపెట్ట‌మ‌ని వేడుకుంటోన్న ప‌రిస్థితి. మ‌రి కొంద‌రు ప్ర‌భాక‌ర్ ఇప్ప‌ట‌కీ చేస్తోన్న ఆగ‌డాలు భ‌రించ‌లేక వైసీపీలోకి జంప్ చేస్తున్నారు. 

 

బలాలు (+) :
- ప్ర‌తి ఒక్క‌రితో అప్యాయ‌త‌గా మాట్లాడ‌డం
-  అబ్బ‌య్య చౌద‌రి వ్య‌క్తిత్వం, వ్య‌వ‌హార శైలీ
- మార్నింగ్ వాక్‌లో ప్ర‌తి రోజు ప్ర‌జ‌ల‌కు అందుబాటులో ఉండ‌డం
- పార్టీల‌తో సంబంధం లేకుండా అంద‌రికి ప‌నులు చేయ‌డం
- స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో ఇప్ప‌డికే ఆధిప‌త్యం చెలాయించ‌డం
- టీడీపీ నుంచి వైసీపీలోకి భారీ చేరిక‌లు

 

బ‌ల‌హీన‌త‌లు :
- గోదావ‌రి కాలువ మ‌ట్టి వైసీపీ లీడ‌ర్లు అమ్మేస్తున్నా ప‌ట్టించుకోవ‌డం లేద‌న్న ఆరోప‌ణ‌లు

 

రాజ‌కీయంగా ఎలా ఉందంటే...
అటు ప్ర‌భాక‌ర్ జైలుకు వెళ్ల‌డం, ఇటు ఏపీలో టీడీపీకి భ‌విష్య‌త్తుపై బెంగ‌తో చాలా మంది టీడీపీ కీల‌క నాయ‌కులు ఇప్ప‌టికే వైసీపీలోకి వ‌చ్చేయ‌గా... మ‌రికొంద‌రు పార్టీ మారేందుకు రెడీగా ఉన్నారు. ఓవ‌రాల్‌గా చూస్తే ఎమ్మెల్యే వ్య‌క్తిత్వంతోనే నియోజ‌క‌వ‌ర్గంలో అంద‌రి మ‌న‌స్సులు గెలుచుకుంటున్నారు. ఏఎంసీ  చైర్మ‌న్ బీసీల‌కు, వైఎస్ ఏఎంసీ చైర్మ‌న్ ఎస్సీల‌కు ఇవ్వ‌డం క్యాస్ట్ ఈక్వేష‌న్ల‌లో తిరుగులేని అస్త్రం ప్రయోగించిన‌ట్ల‌య్యింది. అయితే అభివృద్ధి విష‌యంలో మాత్రం ప్ర‌భాక‌ర్‌ను అందుకోవాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంద‌న్న‌ది కొంద‌రు న్యూట్ర‌ల్ జ‌నాల అభిప్రాయం.

 

 

 

 

 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: