2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు ఎక్కువ శాతం జగన్ ఇమేజ్ తోనే గెలిచారు. అలా జగన్ ఇమేజ్ తో గెలిచిన ఎమ్మెల్యేల్లో తూర్పు గోదావరి జిల్లా రామచంద్రాపురం వైసీపీ ఎమ్మెల్యే చెల్లుబోయిన వేణుగోపాల్  కూడా ఒకరు. ఇక్కడ టీడీపీ నుంచి బలమైన అభ్యర్థి తోట త్రిమూర్తులపై కేవలం 5 వేల ఓట్ల తేడాతో విజయం సాధించారు. జగన్ గాలి ఉండటం వల్లే ఆ మాత్రం మెజారిటీతో వేణుగోపాల్ విజయం సాధించారు.

 

ఇక తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన వేణు, తన పరిధిలో ఉన్నవరకు పనిచేసుకుంటున్నారు. పార్టీకి విధేయుడిగా ఉంటూ, నియోజకవర్గంలో ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారు. మరి గొప్పగా ఏమి కాకపోయినా, ఓ మోస్తరుగా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుంటున్నారు. అయితే మొన్నటివరకు టీడీపీలో ఉన్న తోట త్రిమూర్తులు వైసీపీలోకి వచ్చిన విషయం తెలిసిందే.

 

దీంతో రాజకీయ సమీకరణలు ఒక్కసారిగా మారిపోయాయి. అయితే ఈ నియోజకవర్గానికి చెందిన డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్ చంద్రబోస్, నెక్స్ట్ రాజ్యసభకు వెళ్లనున్నారు. ఇక తోటని అమలాపురం పార్లమెంటరీ అధ్యక్షుడుగా నియమించారు. దానివల్ల చెల్లుబోయినకు పెద్ద ఇబ్బంది లేకుండా పోయింది.కాకపోతే వచ్చే ఎన్నికల్లో మాత్రం వేణుకు ఇబ్బందులు తప్పవని అంటున్నారు. తోట ఎలాగోలా, రామచంద్రాపురం సీటు దక్కించుకోవడం ఖాయమంటున్నారు. తర్వాత చెల్లుబోయినకు మాత్రం సీటు దక్కడం కష్టమే అంటున్నారు. కాకపోతే జగన్ వేరే చోట సీటు ఇచ్చే అవకాశముంది.

 

ఇదే సమయంలో ఇక్కడ టీడీపీ కాలగర్భంలో కలిసిపోయినట్లే అని తెలుస్తోంది. తోట వైసీపీలోకి వచ్చేశాక, టీడీపీని నడిపించే నాయకుడు లేకుండా పోయారు. అసలు ఇక్కడ టీడీపీకి దిక్కే లేదు. అందుకే స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ మొత్తం క్లీన్ స్వీప్ చేసేసే అవకాశముంది. టీడీపీ తరుపున పోటీ చేసే నాయకుడే కరువైపోయారు. దీంతో వైసీపీకి తిరుగులేకుండా పోయింది. అయితే వచ్చే ఎన్నికల్లో ఇక్కడ టీడీపీ తరుపున ఎవరిని నిలబెడతారో కూడా అర్ధంకాకుండా ఉంది.

 

ఇక వైసీపీలో విభేదాలు ఉన్నాసరే టీడీపీ సరిగా లేకపోవడం వల్ల పెద్దగా వైసీపీకి పెద్దగా వచ్చే నష్టమేమి లేదు. కాకపోతే వచ్చే ఎన్నికల్లో టికెట్ మాత్రం తోటకే వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని, కాబట్టి చెల్లుబోయినకు రామచంద్రాపురంలో మరో ఛాన్స్ ఉండకపోవచ్చని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: