2019 ఎన్నికల్లో ఎక్కువ శాతం వైసీపీ ఎమ్మెల్యేలు జగన్ వేవ్‌లోనే గెలిచిన విషయం తెలిసిందే. అలా జగన్ వేవ్‌లో గెలిచిన ఎమ్మెల్యేల్లో అలజంగి జోగారావు కూడా ఒకరు. విజయనగరం జిల్లా పార్వతీపురం నియోజకవర్గం నుంచి పోటీ చేసిన జోగారావు..టీడీపీ అభ్యర్ధి బొబ్బిలి చిరంజీవులుపై విజయం సాధించారు. దాదాపు 24 వేల ఓట్లపైనే మెజారిటీతో గెలిచారు.

 

అయితే తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన జోగారావు పెద్ద ఎఫెక్టివ్‌గా పని చేస్తున్నట్లు కనిపించడం లేదు. జగన్ వేవ్‌ని ఉపయోగించుకుని, ఇంకా బలపడాల్సిపోయింది, బలహీన పడుతున్నట్లు తెలుస్తోంది. పైగా ఇక్కడ వైసీపీలో గ్రూపులు ఉండటం ఇంకా తలనొప్పిగా మారింది. 2014 ఎన్నికల్లో వైసీపీ తరుపున పోటీ చేసి ఓడిపోయిన జమ్మన ప్రసన్న కుమార్‌ గ్రూపుకు, ఎమ్మెల్యే గ్రూపుకు పడటం లేదు. పైగా ప్రసన్న కుమార్‌కు ఎలాంటి నామినేటెడ్ పదవి రాకుండా జోగారావు అడ్డుకుంటున్నారట.

 

దీంతో అసంతృప్తిగా ఉన్న ప్రసన్న కుమార్, జోగారావుకు పెద్దగా సహకరించడం లేదు. దీనికి తోడు జోగారావు పలు వివాదాల్లో ఉన్నారని టాక్. నియోజకవర్గంలో జోగారావు పైరవీలు, కలెక్షన్ల వసూళ్లు చేస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. దీని వల్ల నియోజకవర్గంలో వైసీపీకి బ్యాడ్ నేమ్ పెరిగిందట. ఇదే సమయంలో ఎన్నికల్లో ఓటమి చవిచూశాక టీడీపీ స్ట్రాంగ్ అయినట్లే కనిపిస్తోంది. ఇక్కడ టీడీపీకి మాజీ ఎమ్మెల్యే బొబ్బిలి చిరంజీవులు అండగా ఉన్నారు. అలాగే ఎమ్మెల్సీలు ద్వారపురెడ్డి జగదీష్, శతృచర్ల విజయరామరాజులకు కూడా నియోజకవర్గంపై పట్టు ఉంది. దీని వల్ల పార్టీ స్ట్రాంగ్ అవుతూ వచ్చింది.

 

అటు కింది స్థాయిలో కేడర్ కూడా బలంగానే ఉంది. కాకపోతే వైసీపీ అధికారంలో ఉండటం వల్ల స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీకి పెద్ద అనుకూల ఫలితాలు వచ్చే అవకాశం లేదు. జోగారావు పనితీరు సరిగా లేకపోయినా, వైసీపీ కేడర్ బాగా కష్టపడి పనిచేస్తుంది. దాని వల్ల మెజారిటీ స్థానాలు వైసీపీనే దక్కించుకోనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: