తమ్మినేని సీతారాం...ఏపీ రాజకీయాల్లో పరిచయం అక్కరలేని పేరు. ప్రస్తుతం ఏపీ స్పీకర్ గా ఉన్న తమ్మినేని...తన రాజకీయ జీవితం టీడీపీలో మొదలుపెట్టారు. 1983 లో శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. అలాగే 1985 లో కూడా అదే స్థానం నుంచి గెలిచారు. ఇక 1989 లో ఓడిపోయినా... 1991 ఉపఎన్నికలో మళ్ళీ విజయం సాధించారు.

 

ఆ తర్వాత 1994 , 1999 ఎన్నికల్లో వరుసగా విజయం సాధించి చంద్రబాబు కేబినెట్ లో మంత్రిగా పనిచేసారు. ఇక 2004 లో ఓడిపోయినా తమ్మినేని...2009 లో ప్రజారాజ్యంలోకి వెళ్లి అదే స్థానం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. నెక్స్ట్ వైసీపీలోకి వెళ్లి 2014 ఎన్నికల్లో తన సొంత బామ్మర్ది కూన రవికుమార్ చేతిలో ఓడిపోయారు. ఓటమి ఎదురైనా తమ్మినేని ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా పని చేసుకుంటూ వచ్చి...2019 ఎన్నికల్లో విజయం సాధించి, ఏపీ స్పీకర్ స్థానంలో కూర్చున్నారు.

 

ఓ వైపు స్పీకర్ పదవిని సమర్ధవంతంగా నిర్వహిస్తూనే, మరోవైపు ఎమ్మెల్యేగా నియోజకవర్గంలో మంచిగా పనిచేసుకుంటున్నారు. ఎప్పటికప్పుడు ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారు. పార్టీని కూడా బలోపేతం చేస్తూ దూసుకెళుతున్నారు. ఇదే సమయంలో ఆమదాలవలసలో టీడీపీని తమ్మినేని బామ్మర్ది కూన రవికుమార్  నడిపిస్తున్నారు. అయితే తమ్మినేనికి...కూన బామ్మర్ది/మేనల్లుడు ఇలా రెండు వరుసలు అవుతాడు.  తమ్మినేని వాళ్ళ భార్య తమ్ముడు కూన. అలాగే తమ్మినేని వాళ్ళ అక్క కొడుకు కూన.

 

ఇక వరుసలు విషయం పక్కనబెడితే కూన, తమ్మినేని గట్టి పోటీనే ఇస్తున్నాడు. నియోజకవర్గంలో యాక్టివ్ గా పని చేస్తున్నారు. కార్యకర్తలని కలుపుకుని పోతూ...వైసీపీ ప్రభుత్వంపై పోరాటం చేస్తున్నారు. కేసులు ఎదురైనా ఏ మాత్రం తగ్గకుండా పనిచేస్తున్నారు. అయితే ప్రస్తుతం వైసీపీ అధికారంలో ఉండటంతో తమ్మినేనికి తిరుగులేకుండా ఉంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ మెజారిటీ స్థానాలు దక్కే అవకాశముంది. నియోజకవర్గంలో ఆమదాలవలస, పొందూరు, సరుబుజ్జిలి, బూర్జ మండలాలు ఉన్నాయి. మెజారిటీ నియోజకవర్గాల్లో వైసీపీకి బలం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: