పశ్చిమగోదావరి జిల్లాలో టీడీపీకి మంచి పట్టు ఉన్న సంగతి తెలిసిందే. టీడీపీ అధికారంలోకి  వచ్చిన ప్రతిసారి ఇక్కడ మెజారిటీ స్థానాలు గెలుచుకుంటుంది. 2014 ఎన్నికల్లో కూడా అదే జరిగింది. జిల్లాలో ఉన్న మొత్తం 15 అసెంబ్లీ స్థానాలని గెలుచుకుంది. అయితే 2019 ఎన్నికలోచ్చేసరికి పరిస్థితి మారిపోయింది. మొత్తం 15 స్థానాల్లో వైసీపీ 13 చోట్ల గెలిస్తే, టీడీపీ కేవలం రెండు స్థానాల్లోనే గెలిచింది.

 

అయితే ఇక్కడ టీడీపీ గెలిచింది కంచుకోటల్లోనే పాలకొల్లు, ఉండి నియోజకవర్గాల్లో విజయం సాధించింది. ఉండి నియోజకవర్గం ఎప్పుడు టీడీపీకి కంచుకోటనే. 1983 నుంచి అంటే టీడీపీ ఆవిర్భావం నుంచి చూసుకుంటే ఇక్కడ టీడీపీ జెండా ఎగురుతూనే ఉంది. 1983, 85,89, 1994, 1999, 2009, 2014, 2019 ఎన్నికల్లో టీడీపీదే విజయం. ఒక్క 2004లోనే కాంగ్రెస్ గెలిచింది.

 

ఇక 2009, 2014 ఎన్నికల్లో ఇక్కడ నుంచి టీడీపీ తరుపున వేటుకూరి వెంకట శివరామరాజు(కలవపూడి శివ) విజయం సాధించారు. అయితే 2019 ఎన్నికల్లో చంద్రబాబు, శివని నరసాపురం ఎంపీగా నిలబెట్టగా, శివ సోదరుడు వరుసైన మంతెన రామరాజు(కలవపూడి రాంబాబు)ని ఉండి అసెంబ్లీ బరిలో నిలబెట్టారు. రాష్ట్రమంతా జగన్ గాలి ఉన్నా సరే, ఉండి టీడీపీకి కంచుకోట అని మరోసారి రుజువైంది. రామరాజు మంచి మెజారిటీతో గెలిచారు.

 

ప్రతిపక్షానికి పరిమైతమైన సరే నియోయజకవర్గంలో తనకు సాధ్యమైన మేర పనులు చేసుకుంటున్నారు. కాకపోతే మొదట్లో కాస్త యాక్టివ్ గానే ఉన్న రామరాజు, ఈ మధ్య పెద్దగా కనిపించడం లేదు. ఈ క్రమంలోనే ఆయన వైసీపీ వైపుకు వెళ్ళే అవకాశముందని ప్రచారం జరిగింది. తన సామాజికవర్గం వారు వైసీపీలోకి వెళ్లాలని ఒత్తిడి చేస్తున్నట్లు సమాచారం. అయితే ఒత్తిడి ఉన్నా సరే, రామరాజు టీడీపీని వీడలేదు. అలా అని యాక్టివ్ గా ఉండటం లేదు.

 

ఇదే సమయంలో వైసీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయిన పి‌వి‌ఎల్ నరసింహరాజు, ప్రజలకు అండగా ఉంటూ, పార్టీని బలోపేతం చేసుకుంటున్నారు. ఒక ఎమ్మెల్యే చేయాల్సిన పనులన్నీ ఈయనే చక్కపెడుతున్నారు. ప్రభుత్వ పథకాలు సక్రమంగా ప్రజలకు అందిస్తున్నారు. అటు స్థానిక సంస్థల ఎన్నికల విషయానికొస్తే వైసీపీకే ఆధిక్యం రావడం ఖాయం. నియోజకవర్గంలో కాళ్ళ, పాలకోడేరు, ఉండి, ఆకివీడు మండలాలు ఉన్నాయి. అన్నిచోట్ల టీడీపీ, వైసీపీలు పోటాపోటీగానే ఉన్నాయి. మొత్తానికైతే ఉండిలో టీడీపీ కేడర్ స్ట్రాంగ్‌గానే ఉన్న ఎమ్మెల్యే మాత్రం వీక్ గా ఉన్నట్లు కనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: