కర్నూలు జిల్లాలో శిల్పా మోహన్ రెడ్డి వారసుడుగా శిల్పా రవి చంద్ర కిషోర్ రెడ్డి 2019 ఎన్నికల్లో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడమే అదిరిపోయే విజయం సొంతం చేసుకున్నారు. వైసీపీ తరుపున నంద్యాల ఎమ్మెల్యేగా పోటీ చేసి టీడీపీ యువ నేత భూమా బ్రహ్మానందరెడ్డిపై విజయం సాధించారు. దాదాపు 34 వేల మెజారిటీతో రవి గెలిచారు.

 

తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన రవి....దూకుడుగా నియోజకవర్గంలో పనిచేస్తున్నారు. ప్రజలకు ఎప్పుడు అందుబాటులోనే ఉంటున్నారు. కార్యకర్తలకు ఫుల్ సపోర్ట్ ఇస్తున్నారు. కార్యకర్తలకు ఎలాంటి సమస్యలు ఉన్నా రవి స్పందిస్తున్నారు. ఇక అధికారులతో మంచిగా చెప్పుకుని పనులు చేయించుకుంటున్నారు. అటు ప్రభుత్వ పథకాలు ఎలాగో బాగానే అందుతున్నాయి. అయితే నియోజకవర్గంలో రవి ఒకే ఒక పెద్ద మైనస్ ఉంది. ఈ ఏడాది కాలంలో నియోజకవర్గంలో పెద్ద అభివృద్ధి ఏమి జరగలేదు.

 

ఎక్కడ పనులు అక్కడే పెండింగ్ లో ఉన్నాయి. అయితే నిధులు కూడా పెద్దగా అందకపోవడం వల్లే రవికి పనులు చేయించడం కుదరట్లేదని తెలిసింది. అయితే అభివృద్ధి జరగకపోయినా, సంక్షేమ పథకాల వల్ల రవికు ప్లస్ అవుతుంది. ఇక టీడీపీలో భూమా బ్రహ్మానందరెడ్డి యాక్టివ్ గానే పనిచేసుకుంటున్నారు. భూమా నాగిరెడ్డి మరణంతో రాజకీయాల్లోకి వచ్చిన బ్రహ్మానందరెడ్డి...2017 నంద్యాల ఉపఎన్నికల్లో టీడీపీ తరుపున నిలబడి భారీ మెజారిటీతో గెలిచారు.

 

కానీ 2019 ఎన్నికలోచ్చేసరికి దారుణంగా ఓడిపోయారు. ఓడిపోయిన నియోజకవర్గంలో బాగానే పనిచేస్తున్నారు. కాకపోతే భూమా అఖిలప్రియ తన సొంత తమ్ముడు విఖ్యాత్ రెడ్డికి నంద్యాలలో పెత్తనం ఇవ్వాలని చూస్తోంది. ఈ క్రమంలోనే బ్రహ్మానందరెడ్డికి అఖిలనే చెక్ పెడుతున్నట్లు తెలుస్తోంది. దీని వల్ల నంద్యాలలో టీడీపీ ఇంకా పుంజుకోలేకపోతుంది. వైసీపీపై నెగిటివ్ పెరుగుతున్న కూడా దాన్ని ఉపయోగించుకోలేని స్థితిలో టీడీపీ ఉంది. మొత్తానికైతే ఎమ్మెల్యే రవికి నిధులు అందకపోవడం పెద్ద మైనస్ అయితే, బ్రహ్మానందరెడ్డికి అఖిలతో పెద్ద తలనొప్పి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: