సీదిరి అప్పలరాజు...తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచి, అనూహ్యంగా మంత్రి అయిన నేత. మండలి రద్దు నేపథ్యంలో మోపిదేవి వెంకటరమణ ఎమ్మెల్సీ పదవికి, మంత్రి పదవికి రాజీనామా చేశారు. దీంతో మోపిదేవికి జగన్ రాజ్యసభ ఇవ్వగా, ఆయన స్థానంలో శ్రీకాకుళం జిల్లా పలాస నుంచి గెలిచిన సీదిరి అప్పలరాజుకు మంత్రిగా ఛాన్స్ ఇచ్చారు. ఇక ఇప్పుడే కొత్తగా మంత్రి కావడంతో అప్పలరాజు నిదానంగా తన శాఖపై పట్టుతెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు.


ఇదే సమయంలో ఎమ్మెల్యేగా కూడా అప్పలరాజు తన నియోజకవర్గంలో దూకుడుగా పనిచేస్తున్నారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారు. అసెంబ్లీలో మాత్రం అదిరిపోయే స్పీచ్‌లు ఇస్తూ...ప్రతిపక్ష టీడీపీకి కౌంటర్లు ఇస్తున్నారు. ఒకానొక సమయంలో తనకు టెన్త్ క్లాస్‌లో అవార్డు ఇచ్చిన చంద్రబాబుపైనే ఘాటు విమర్శలు చేశారు. బాబుకు మానసిక వ్యాధి వచ్చిందని దారుణంగా మాట్లాడారు. ఇక ఈ విమర్శలతో అప్పలరాజు మీద కొంచెం నెగిటివ్ వచ్చింది. తొలిసారి ఎమ్మెల్యే అయ్యి ఈ విధంగా దారుణంగా మాట్లాడటం సరికాదని విమర్శలు కూడా వచ్చాయి. ఇప్పుడు మంత్రి కావడంతో అప్పలరాజు రాష్ట్ర స్థాయిలో ఫేమస్ అయ్యారు. అలాగే నియోజకవర్గంలో పలు అభివృద్ధి  కార్యక్రమాలు చేస్తున్నారు. సంక్షేమ పథకాలు ఎలాంటి లోటు లేకుండా అందుతున్నాయి.


అటు పలాసలో టీడీపీకి అండగా గౌతు శిరీష ఉన్నారు. పైగా తన ఫ్యామిలీకి ఇక్కడ మంచి పట్టు ఉంది. కాకపోతే జగన్ గాలి వల్ల పరాజయం పాలయ్యారు. దీంతో శిరీష కష్టపడి పనిచేస్తూ..పార్టీని బలోపేతం చేసుకుంటూ ముందుకెళుతున్నారు.  పలాసలో పలు సమస్యలు ఉన్నాయి. పలాసలో ఎక్కువగా ఉఫాధి ప్రధాన సమస్య ఉంది. జీడీ పరిశ్రమ తప్పా, ఉఫాధి అందించే మార్గాలు తక్కువ. తితిలీ తూఫాన్ దాటికి నష్టపోయిన జీడిచెట్లు మళ్ళీ ఉత్పత్తి చెయ్యాలంటే మరో 10 సంవత్సరాలు పడుతుంది. అటు ప్రాధమిక వసతులైన తాగునీరు, వైద్యం, విద్యా రంగాలపై పాలకులు దృష్టిని కేంద్రీకరించాలి. ఇక్కడ పారిశుద్ధ్యం, రహదారులు ప్రధాన సమస్యలు. భూగర్భ మురుగునీటి వ్యవస్థ, మరుగుదొడ్లు, కల్పించి, పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలి.




 

                                                                           

మరింత సమాచారం తెలుసుకోండి: