2019 ఎన్నికల్లో ఊహించని ఫలితాలు చాలానే వచ్చాయి. చాలామంది గెలుపు ఖాయమనుకున్న టీడీపీ నేతలు ఓటమి పాలయ్యారు. అందులో భూమా అఖిలప్రియ కూడా ఘోరంగా ఓడిపోయారు. మామూలుగా ఆళ్లగడ్డ నియోజకవర్గం భూమా ఫ్యామిలీ కంచుకోట. ఆళ్లగడ్డ నుంచి 1989లో భూమా శేఖర రెడ్డి టీడీపీ నుంచి గెలిస్తే , 1994లో భూమా నాగిరెడ్డి, 1999లో భూమా శోభా నాగిరెడ్డిలు టీడీపీ నుంచి విజయం సాధించారు. అయితే 2004లో భూమా నాగిరెడ్డి టీడీపీ పోటీ చేసి ఓడిపోగా, 2009లో శోభా నాగిరెడ్డి ప్రజారాజ్యం నుంచి పోటీ చేసి గెలిచారు. ఇక 2014లో శోభానాగిరెడ్డి ఎన్నికల ప్రచారంలో ప్రమాదవశాత్తు మరణించగా, ఎన్నికల్లో ఆమె వైసీపీ అభ్యర్ధిగా విజయం సాధించారు.

ఆ తర్వాత వెంటనే వచ్చిన ఉపఎన్నికల్లో నాగిరెడ్డి-శోభాల కుమార్తె అఖిలప్రియ వైసీపీ తరుపున గెలిచారు. అయితే నెక్స్ట్ నాగిరెడ్డి, కుమార్తెతో కలిసి టీడీపీలోకి వచ్చేశారు. ఇక నాగిరెడ్డి కూడా అనారోగ్యంతో మరణించారు. తర్వాత అఖిలప్రియ చంద్రబాబు కేబినెట్‌లో మంత్రిగా పనిచేసి, 2019 ఎన్నికల్లో ఆళ్లగడ్డ నుంచి టీడీపీ తరుపున పోటీ చేసి ఓడిపోయారు. వైసీపీ నుంచి గంగుల బిజేంద్ర రెడ్డి 35 వేల మెజారిటీతో గెలిచి, ఆళ్లగడ్డలో భూమా ఫ్యామిలీ ఆధిపత్యానికి చెక్ పెట్టారు.

మొదటిసారి గెలిచిన బిజేంద్ర దూకుడుగా పనిచేస్తున్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ పథకాలు అందేలా చేస్తున్నారు. కొత్తగా సిసి రోడ్లు, అండర్ డ్రైనేజ్, సచివాలయ నిర్మాణాలు చేపట్టారు. ఇక ప్రభుత్వ పరంగా వచ్చే పథకాలు సక్రమంగా ప్రజలు అందేలా చేస్తున్నారు. అటు త్రాగునీటి సమస్యలు కూడా పరిష్కరిస్తున్నారు. అటు ప్రత్యర్ధిగా ఉన్న అఖిల కూడా దూకుడుగా ఉన్నారు. కర్నూలులో టీడీపీ తరుపున జగన్ ప్రభుత్వంపై పోరాడుతున్న వారిలో అఖిలనే ముందున్నారు. డిపోయాక అఖిలప్రియ ఫుల్ యాక్టివ్‌గా నియోజకవర్గంలో పనిచేస్తున్నారు. అటు వైసీపీ ప్రభుత్వంపై, ఇటు ఎమ్మెల్యే బిజేంద్రపై గట్టిగానే పోరాడుతున్నారు. అలాగే కార్యకర్తలకు ఎలాంటి ఇబ్బందులు కలిగిన వెంటనే స్పందిస్తున్నారు. ఆళ్లగడ్డలో భూమా ఫ్యామిలీకి గట్టి పట్టు ఉండటంతో అఖిల ఎప్పుడైనా పుంజుకునే అవాకాశాలున్నాయి. కాబట్టి బిజేంద్ర ఇంకా దూకుడుగా ఉంటేనే నెక్స్ట్ భూమా ఫ్యామిలీని నిలువరించగలరు.

మరింత సమాచారం తెలుసుకోండి: