గత ఎన్నికల్లో జగన్ వేవ్‌లో వైసీపీ నుంచి అనేక మంది ఎమ్మెల్యేలు గెలిచిన విషయం తెలిసిందే. అలా జగన్ వేవ్‌లో గెలిచిన ఎమ్మెల్యేల్లో అలజంగి జోగారావు కూడా ఒకరు. విజయనగరం జిల్లా పార్వతీపురం నియోజకవర్గం నుంచి పోటీ చేసిన జోగారావు..టీడీపీ అభ్యర్ధి బొబ్బిలి చిరంజీవులుపై విజయం సాధించారు.

అయితే తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన అలజంగి  జోగారావు పెద్ద ఎఫెక్టివ్‌గా పని చేస్తున్నట్లు కనిపించడం లేదు. ప్రభుత్వ పథకాలు ఒకటే ఎమ్మెల్యేకు అడ్వాంటేజ్. పైగా ఇక్కడ సమస్యలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. పార్వతీపురం మండలంలో మహిళా డిగ్రీ కాలేజీ, ఇంజనీరింగ్ కాలేజీ అవసరం. ఇక్కడ రైల్వే గేట్లు పెద్ద సమస్య. ఈ సమస్యని అధిగమించేందుకు ఫ్లైఓవర్ బ్రిడ్జిలను నిర్మించాలి. తాగునీటి సమస్య కూడా ఎక్కువగానే ఉంది.

ఇక రాజకీయ పరంగా చూసుకుంటే, పార్వతీపురం వైసీపీలో గ్రూపులు ఉన్నాయి.  2014 ఎన్నికల్లో వైసీపీ తరుపున పోటీ చేసి ఓడిపోయిన జమ్మన ప్రసన్న కుమార్‌ గ్రూపుకు, ఎమ్మెల్యే గ్రూపుకు పడటం లేదు. పైగా ప్రసన్న కుమార్‌కు ఎలాంటి నామినేటెడ్ పదవి రాకుండా జోగారావు అడ్డుకుంటున్నారట.

దీంతో అసంతృప్తిగా ఉన్న ప్రసన్న కుమార్, జోగారావుకు పెద్దగా సహకరించడం లేదు. దీనికి తోడు జోగారావు పలు వివాదాల్లో ఉన్నారని టాక్. నియోజకవర్గంలో జోగారావు పైరవీలు, కలెక్షన్ల వసూళ్లు చేస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. దీని వల్ల నియోజకవర్గంలో వైసీపీకి బ్యాడ్ నేమ్ పెరిగిందట.

ఇదే సమయంలో ఎన్నికల్లో ఓటమి చవిచూశాక టీడీపీ స్ట్రాంగ్ అయినట్లే కనిపిస్తోంది. ఇక్కడ టీడీపీకి మాజీ ఎమ్మెల్యే బొబ్బిలి చిరంజీవులు అండగా ఉన్నారు. అలాగే ఎమ్మెల్సీలు ద్వారపురెడ్డి జగదీష్, శతృచర్ల విజయ రామరాజులకు కూడా నియోజకవర్గంపై పట్టు ఉంది. దీని వల్ల పార్టీ స్ట్రాంగ్ అవుతూ వచ్చింది. అటు కింది స్థాయిలో కేడర్ కూడా బలంగానే ఉంది. మొత్తానికి చూసుకుంటే ఇక్కడ టీడీపీనే కాస్త డామినేట్ చేస్తున్నట్లు కనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: