ఏపీలో ప్రతిపక్ష టీడీపీలో బలమైన ఎమ్మెల్యేల్లో ఏలూరి సాంబశివరావు ఒకరని చెప్పొచ్చు. బలమైన నాయకుడు కాబట్టే 2019 ఎన్నికల్లో రాష్ట్రమంతా జగన్ గాలి బలంగా వీచినా సరే, ఆ గాలికి ఎదురు నిలబడి ఏలూరి సాంబశివరావు పర్చూరులో టీడీపీ జెండా ఎగరవేశారు. అయితే 2019 ఎన్నికల్లో ఏలూరి గెలవడానికి కారణం...అంతకముందు ఆయన నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి.

2014లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన ఏలూరి, ఐదేళ్ల పాటు పర్చూరుని అభివృద్ధి బాట పట్టించారు. అలాగే ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉంటూ, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేశారు. అందుకే రెండోసారి కూడా పర్చూరు ప్రజలు ఏలూరిని గెలిపించుకున్నారు. కానీ రెండోసారి మాత్రం టీడీపీ అధికారంలోకి రాకపోవడంతో ఏలూరికి కాస్త ఇబ్బందికర పరిస్తితులు ఎదురవుతున్నాయి. అధికారంలో లేకపోవడం వల్ల నియోజకవర్గానికి నిధులు తెచ్చి అభివృద్ధి కార్యక్రమాలు చేయలేకపోతున్నారు.

అలా అని ఏలూరి సైలెంట్‌గా ఉండటం లేదు. ప్రజల మధ్యలోనే ఉంటూ, ప్రజల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తున్నారు. అవసరమైతే తన సొంత నిధులు కూడా ఖర్చు పెట్టి ప్రజలకు అండగా నిలబడుతున్నారు. అటు నియోజకవర్గంలో పార్టీని మరింతగా బలోపేతం చేస్తూనే, మరోవైపు బాపట్ల పార్లమెంట్ అధ్యక్షుడుగా దూకుడుగా పనిచేస్తున్నారు.

ఇలా ప్రజల మద్ధతు ఎక్కువగా ఉండే ఏలూరికి పర్చూరులో వ్యతిరేకత పెరిగిందని ఇటీవల ఆత్మసాక్షి అనే సర్వే తేల్చి చెప్పింది. పర్చూరులో ఏలూరికి మళ్ళీ గెలుపు కష్టమని వివరించింది. అయితే వాస్తవ పరిస్తుతులని చూస్తే అలా కనిపించడం లేదు. ఇక్కడ వైసీపీ ప్రభుత్వం ఏదో ప్రభుత్వ పథకాలు ఇస్తుంది తప్ప, కొత్తగా పర్చూరు ప్రజలకు చేసేది ఏమి లేదు. పైగా ఏలూరి ఎప్పుడు ప్రజలకు అండగానే ఉంటారు. అటు నియోజకవర్గంలో వైసీపీ కూడా బాగా వీక్‌గా కనిపిస్తుంది. ఇలాంటి పరిస్తితులు ఉన్న నేపథ్యంలో ఆ సర్వే...ఏలూరిని ఓటమి లిస్ట్‌లో పెట్టడం విశ్లేషకులని కాస్త ఆశ్చర్యపరిచింది.


మరింత సమాచారం తెలుసుకోండి: