పశ్చిమ గోదావరి జిల్లాలో తెలుగుదేశం పార్టీకి కంచుకోటల్లాంటి నియోజకవర్గాలు చాలానే ఉన్నాయి. అలా కంచుకోటలుగా ఉన్న నియోజకవర్గాల్లో గత ఎన్నికల్లో వైసీపీ భారీ మెజారిటీలతో గెలిచింది. అలా వైసీపీ భారీ మెజారిటీతో గెలిచిన టి‌డి‌పి కంచుకోట వచ్చి గోపాలాపురం. గోపాలాపురం మొదట నుంచి టి‌డి‌పికి అనుకూలమైన నియోజకవర్గం...1983, 1985, 1989, 1994, 1999, 2009, 2014 ఎన్నికల్లో ఇక్కడ టి‌డి‌పినే గెలిచింది. 2004లో కాంగ్రెస్ గెలిచింది.

ఇక 2019 ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించింది. వైసీపీ తరుపున తలారి వెంకట్రావు పోటీ చేసి, టి‌డి‌పి అభ్యర్ధి ముప్పిడి వెంకటేశ్వరరావుపై దాదాపు 37 వేల ఓట్ల మెజారిటీతో గెలిచారు. అలా భారీ మెజారిటీతో గెలిచిన తలారి...అంతే భారీగా ప్రజలకు అండగా ఉండటంలో కాస్త ఫెయిల్ అయినట్లే కనిపిస్తోంది. పూర్తి స్థాయిలో తలారి ప్రజలకు అందుబాటులో ఉండటం కష్టమని తెలుస్తోంది. ఈయన గోపాలాపురం, ద్వారకా తిరుమల మండలాలని ఎక్కువ పట్టించుకుంటూ...నల్లజెర్ల, దేవరపల్లి మండలాలపై దృష్టి పెట్టడం లేదని తెలుస్తోంది.

పైగా ద్వితీయ శ్రేణి నాయకులకు తలారికి పెద్దగా పడటం లేదని టాక్. అటు ప్రభుత్వ పథకాలు ఎమ్మెల్యేకు బాగా ప్లస్ అవుతున్నాయి. ప్రభుత్వం తరుపున జరిగే కార్యక్రమాలు తప్ప గోపాలాపురంలో మరొక కొత్త కార్యక్రమం జరగడం లేదు. ఇక్కడ రోడ్ల పరిస్తితి మరీ దారుణంగా ఉంది. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల సమస్యలు పరిష్కరించాలసిన అవసరముంది. అటు ఇసుక, ఇళ్ల స్థలాల్లో వైసీపీ నేతల అక్రమాలు ఎక్కువగానే ఉన్నాయని ప్రతిపక్ష టి‌డి‌పి నేతలు ఆరోపిస్తున్నారు.

ఇటు టి‌డి‌పి తరుపున ముప్పిడి వెంకటేశ్వరావు పనిచేస్తున్నారు. ఓడిపోయిన దగ్గర నుంచి నియోజకవర్గంలో మళ్ళీ పార్టీని బలోపేతం చేసే కార్యక్రమాలు చేస్తున్నారు. ప్రజా సమస్యలపై కూడా బాగానే పోరాటం చేస్తున్నారు. అయితే రెండేళ్ళు ఇంకోచెం కష్టపడితే కంచుకోటని మళ్ళీ టి‌డి‌పి కైవసం చేసుకునే అవకాశాలు ఉన్నాయి. ఏదేమైనా తలారికి ముప్పిడితో కాస్త ముప్పు ఉందనే చెప్పొచ్చు.


మరింత సమాచారం తెలుసుకోండి: