జగన్ 100 శాతం మంత్రివర్గంలో మార్పులు చేయడానికి సిద్ధమవుతున్నారని చెప్పి మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి పదవి ఆశావాహులకు కొత్త ఊపిరి పోశారు. 25 మంది సైడ్ అయితే, వారి ప్లేస్‌లో మరో 25 మంది క్యాబినెట్‌లోకి వస్తారు. ఈ క్రమంలోనే జిల్లాలు, సామాజికవర్గాల సమీకరణాల లెక్కలు వేసుకుంటూ తమకు పదవి వచ్చే అవకాశం ఉందని పలువురు ఎమ్మెల్యేలు ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

ఈ క్రమంలోనే కృష్ణా జిల్లాకు చెందిన పెనమలూరు ఎమ్మెల్యే పార్థసారథి సైతం క్యాబినెట్‌లో తనకు ఛాన్స్ వస్తుందని ఆశిస్తున్నారు. ఎందుకంటే కృష్ణా జిల్లాలో ప్రస్తుతం ముగ్గురు మంత్రులు ఉన్నారు. వారు సైడ్ అయితే వారి ప్లేస్‌లో మరో ముగ్గురు వస్తారు. దీంతో ఒక బెర్త్ తనకే వస్తుందని అనుకుంటున్నారు. పైగా యాదవ వర్గానికి చెందిన అనిల్ కుమార్ యాదవ్ సైడ్ అవుతారు కాబట్టి, ఆయన స్థానంలో సారథికి ఛాన్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి.

రాష్ట్ర రాజకీయాల్లో సీనియర్ ఎమ్మెల్యేగా ఉన్న సారథి...మూడోసారి ఎమ్మెల్యేగా గెలిచారు. గతంలో కాంగ్రెస్ అధికారంలో ఉండగా మంత్రిగా పనిచేశారు. దీంతో జగన్ తనకు మొదట్లోనే ఛాన్స్ ఇస్తారని అనుకున్నారు. కానీ జగన్‌కు విధేయుడుగా ఉన్న అనిల్‌కు పదవి వచ్చింది. ఇక ఈ విడతలో తనకే ఛాన్స్ దక్కుతుందని ఆశగా ఎదురుచూస్తున్నారు. మంత్రి పదవి అంశాన్ని పక్కనబెడితే ఎమ్మెల్యేగా సారథి బాగానే పనిచేసుకుంటున్నారు. పెనమలూరులో ప్రభుత్వం తరుపున జరిగే సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి.

ఇటీవల స్థానిక ఎన్నికల్లో కూడా సత్తా చాటి పెనమలూరులో తన బలం తగ్గలేదని సారథి నిరూపించుకున్నారు. అయితే ప్రత్యర్ధిగా ఉన్న బోడే ప్రసాద్‌ని తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. ఇప్పుడుప్పుడే ఆయన పికప్ అవుతున్నారు. పైగా ఇసుక, ఇళ్ల స్థలాల్లో సారథి అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఈ అంశాలు మరింత నెగిటివ్ అయితే సారథికి ఇబ్బంది అవుతుంది. ఒకవేళ మంత్రి పదవి వస్తే సారథికి మరింతగా బలపడే అవకాశం ఉంది.  


మరింత సమాచారం తెలుసుకోండి: