ఏపీ రాజకీయాల్లో పవన్ కల్యాణ్ దూకుడు పెంచారు...అధికార వైసీపీ టార్గెట్‌గా విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ఎలాగైనా నెక్స్ట్ వైసీపీని గద్దె దించడమే లక్ష్యంగా రాజకీయం స్టార్ట్ చేశారు. అంటే వైసీపీకి చెక్ పెట్టడానికి పవన్ అన్నివిధాలుగా ట్రై చేస్తున్నారు. అయితే పవన్...చంద్రబాబుతో కలిసి జగన్‌ని నిలువరించడానికి ప్రయత్నిస్తున్నారని తెలుస్తోంది.

అంటే టి‌డి‌పి-జనసేనలు పొత్తులో బరిలో దిగడం ఖాయమని అర్ధమవుతుంది. ఒకవేళ అదే జరిగితే వైసీపీలో కొందరు ఎమ్మెల్యేలకు చెక్ పడటం గ్యారెంటీ అని తెలుస్తోంది. అలా టి‌డి‌పి-జనసేన పొత్తు వల్ల నష్టపోయే ఎమ్మెల్యేల్లో మొదట నరసాపురం ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు ముందు ఉంటారు. గత ఎన్నికల్లో ప్రసాదరాజు...జనసేనపై కేవలం 6 వేల ఓట్ల మెజారిటీతో గెలిచారు.

అంటే ఇక్కడ వైసీపీకి జనసేన ఎంత గట్టి పోటీ ఇచ్చిందో అర్ధమవుతుంది. అదే సమయంలో ఇక్కడ టి‌డి‌పికి 27 వేల ఓట్లు పడ్డాయి. ఒకవేళ టి‌డి‌పి జనసేనలు కలిస్తే గత ఎన్నికల్లో ప్రసాదరాజు పరిస్తితి ఏమయ్యేదో చెప్పాల్సిన పని లేదు. ఇక వచ్చే ఎన్నికల్లో ఆ రెండు పార్టీలు పొత్తు పెట్టుకుంటే ప్రసాదరాజుకు ఇబ్బంది అనే చెప్పొచ్చు. అయితే ప్రసాదరాజు ఎమ్మెల్యేగా బాగానే పనిచేసుకుంటూ వెళుతున్నారు. ఎమ్మెల్యేగా ప్రజలకు అందుబాటులో ఉంటూ, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారు. ప్రభుత్వం తరుపున జరిగే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు నరసాపురంలో జరుగుతున్నాయి.

అయితే రెండేళ్లలో గొప్ప అభివృద్ధి కార్యక్రమాలు జరగలేదు. అలాగే ప్రభుత్వం పన్నుల భారం పెంచడం ఎమ్మెల్యేకు మైనస్ అవుతుంది. ఇక ప్రసాదరాజు....నెక్స్ట్ విడతలో మంత్రి పదవి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. మంత్రి అయ్యాక ప్రసాదరాజు ఇంకా బలపడతారేమో చూడాలి. కానీ టి‌డి‌పి-జనసేనలు సెపరేట్‌గా పోటీ చేస్తే ప్రసాదరాజుకు ఎలాంటి ఇబ్బంది లేదు. అలా కాకుండా రెండు పార్టీలు మాత్రం కలిసి పోటీ చేస్తే ప్రసాదరాజు ఓటమి అంచుకు వెళ్ళక తప్పదు.    


మరింత సమాచారం తెలుసుకోండి: