కడప జిల్లా...ఇంకా డౌట్ లేకుండా వైఎస్సార్ అడ్డా అని చెప్పేయొచ్చు. ఇక్కడ వైఎస్సార్ ఫ్యామిలీ బలం ఎక్కువ. అందుకే గతంలో కాంగ్రెస్, ఇప్పుడు వైసీపీలు కడపలో సత్తా చాటుతున్నాయి. 2014 ఎన్నికల్లో జిల్లాలో ఉన్న 10 సీట్లలో వైసీపీ 9 సీట్లు గెలుచుకోగా, టి‌డి‌పి ఒకచోట గెలిచింది. అలా టి‌డి‌పి తరుపున గెలిచిన ఆ ఒక్కరు ఎవరో కాదు...మేడా మల్లిఖార్జున్ రెడ్డి. రాజంపేట నియోజకవర్గం నుంచి మేడా విజయం సాధించారు.

అయితే టి‌డి‌పి అధికారంలోకి రావడంతో అయిదేళ్లపాటు మేడాకు రాజకీయంగా ఎలాంటి ఇబ్బంది లేదు. ఇక 2019 ఎన్నికలోచ్చేసరికి వైసీపీ గాలి స్పష్టంగా ఉందని గ్రహించిన మేడా....ఎన్నికల ముందే వైసీపీలోకి వచ్చేశారు. అలాగే వైసీపీలో కూడా రాజంపేట సీటుని దక్కించుకున్నారు. ఇక జగన్ గాలి, సొంత ఇమేజ్‌తో మేడా మరొకసారి ఎమ్మెల్యేగా గెలిచారు.

ఇక మేడా రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచి రెండున్నర ఏళ్ళు కావొస్తుంది...మరి రెండున్నర ఏళ్లలో మేడా పనితీరు ఎలా ఉందనే విషయం ఒకసారి గమనిస్తే....ఎమ్మెల్యేగా మేడా పనితీరుకు రెండున్నర ఏళ్లలో మంచి మార్కులే పడుతున్నాయి. ముఖ్యంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు బాగా అమలు అవుతున్నాయి. మేడా టి‌డి‌పి నుంచే రావడంతో....పథకాలు ఆ పార్టీ, ఈ పార్టీ అనే తేడా లేకుండా అమలు చేస్తున్నారు. అలాగే ప్రభుత్వం తరుపున పలు అభివృద్ధి కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. ఇక ఇక్కడ పలు సమస్యలు కూడా ఉన్నాయి...తాగునీటి సమస్య అధికంగా ఉంది. నియోజకవర్గంలో రోడ్లని ఇంకా అభివృద్ధి చేయాల్సి ఉంది.

రాజకీయంగా వస్తే మేడాకు రాజంపేటలో ఎదురులేదనే చెప్పొచ్చు. పంచాయితీ, మున్సిపాలిటీ, ఎం‌పి‌టి‌సి, జెడ్‌పి‌టి‌సి ఎన్నికల్లో దాదాపు 90 శాతం పైనే ఫలితాలు రాబట్టారు. ఇక్కడ టి‌డి‌పి తరుపున బత్యాల చెంగల్రాయుడు పనిచేస్తున్నారు...ఈయనకు నియోజకవర్గంలో కాస్త ఫాలోయింగ్ ఉంది. ఈయన్ని తక్కువ అంచనా వేయకుండా పనిచేసుకుంటూ వెళితే..నెక్స్ట్ ఎన్నికల్లో కూడా రాజంపేటలో మేడాకు తిరుగుండదు. మరొకసారి గెలిచి హ్యాట్రిక్ కొట్టగలరు.  


మరింత సమాచారం తెలుసుకోండి: