రాజకీయాలు ఎప్పుడు ఒకేలా ఉండవు....ఎప్పుడు ఒకరికే అనుకూలంగా రాజకీయాలు నడవవు...గత ఎన్నికల్లో వైసీపీకి బాగా అనుకూలంగా రాజకీయాలు నడిచాయి. ఆ ఎన్నికల్లో సరిగ్గా మొహాలు కూడా తెలియకుండానే..ప్రజలు జగన్ బొమ్మని చూసి ఎక్కువ మంది వైసీపీ ఎమ్మెల్యేలని గెలిపించారు. అయితే అలా జగన్ బొమ్మతో గెలిచిన ఎమ్మెల్యేలు కొందరు ఇప్పుడు సొంతంగా మంచి ఇమేజ్ తెచ్చుకునే ప్రయత్నాలు చేస్తున్నారు.

అలా సొంత ఇమేజ్ పెంచుకుంటున్న వారిలో విడదల రజిని కూడా ఒకరు. తొలిసారి రజిని....చిలకలూరిపేట బరిలో దిగి...జగన్ వేవ్‌లో టి‌డి‌పి సీనియర్ నేత ప్రత్తిపాటి పుల్లారావుని ఓడించారు. అలా ఎమ్మెల్యేగా గెలిచిన రజిని...తక్కువ సమయంలోనే మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్నారు. రాష్ట్ర స్థాయిలో రజినికి ఫాలోయింగ్ ఉంది. ఇలా ఫాలోయింగ్ తెచ్చుకున్న రజిని....ఎమ్మెల్యేగా కూడా బాగానే పనిచేసుకుంటున్నారు. పేటలో ప్రభుత్వం తరుపున జరిగే ప్రతి సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అమలు అవుతున్నాయి.

ఇక పంచాయితీ, మున్సిపాలిటీ, ఎం‌పి‌టి‌సి, జెడ్‌పి‌టి‌సి ఎన్నికల్లో కూడా రజిని, పుల్లారావుకు చెక్ పెట్టేశారు. వైసీపీకి మంచి విజయాలు దక్కేలా చేశారు. అలాగే త్వరలోనే రజినికి మంత్రి పదవి వచ్చే అవకాశం కూడా ఉందని ప్రచారం నడుస్తోంది. మరి అంతా బాగునప్పుడు రజినికి రివర్స్ అయ్యేది ఏంటని డౌట్ రావొచ్చు. నెక్స్ట్ ఎన్నికల్లో జగన్ గాలి అంత ఉండకపోవచ్చు. పైగా ప్రత్తిపాటి వేగంగా పుంజుకుంటున్నారు. స్థానిక ఎన్నికలు అధికార పార్టీకి అనుకూలంగానే ఉంటాయి. కాబట్టి వాటిని లెక్కలో పెట్టుకోవాల్సిన అవసరం లేదు.

ఇటు రజినికి సొంత పార్టీ నేతలతో విభేదాలు ఉన్నాయి..కమ్మ వర్గంలో పట్టు ఉన్న మర్రి రాజశేఖర్...ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలుతో రజినికి పడటం లేదు. ఇదే ఆమెకు మైనస్ అయ్యేలా ఉంది. గత ఎన్నికల్లో కమ్మ ఓటర్లు రజిని వైపు మొగ్గు చూపారు. ఈ సారి సీన్ రివర్స్ కానుంది....మళ్ళీ వారు పుల్లారావు వైపు వెళుతున్నారు. అలాగే సొంత పార్టీ నేతలే రజినికి వ్యతిరేకంగా పనిచేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి రజినికి రివర్స్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది.  


మరింత సమాచారం తెలుసుకోండి: