చిత్తూరు జిల్లా పీలేరు...నల్లారి ఫ్యామిలీకి బాగా కలిసొచ్చిన నియోజకవర్గం. 2009 ఎన్నికల్లో ఇక్కడ నుంచి కిరణ్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచి...అనూహ్య రీతిలో సీఎం అయిన విషయం తెలిసిందే. వైఎస్సార్ మరణంతో కిరణ్‌కు సీఎం పదవి దక్కింది. అయితే పీలేరు కంటే ముందు కిరణ్...వాయల్పాడు నియోజకవర్గం నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఇక 2008లో జరిగిన నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా వాయల్పాడు...పీలేరులో విలీనమైంది..దీంతో 2009 ఎన్నికల్లో కిరణ్...అక్కడ నుంచి పోటీ చేసి గెలిచి, నెక్స్ట్ సీఎం కూడా అయ్యారు.

అయితే రాష్ట్ర విభజన జరిగాక కిరణ్ జై సమైక్యాంధ్ర పార్టీ పెట్టి 2014 ఎన్నికల్లో పోటీ చేసి విఫలమయ్యారు. కానీ పీలేరులో కిరణ్ సోదరుడు కిషోర్ కుమార్ రెడ్డి పోటీ చేసి మంచిగానే ఓట్లు తెచ్చుకుని సెకండ్ ప్లేస్‌లో నిలిచారు. ఆ ఎన్నికల్లో వైసీపీ తరుపున చింతల రామచంద్రారెడ్డి విజయం సాధించారు. 2019 ఎన్నికల్లో నల్లారి కిషోర్ టీడీపీలోకి వచ్చి పోటీ చేసి మళ్ళీ చింతల చేతిలో ఓడిపోయారు.

ఇప్పుడు ఎమ్మెల్యేగా చింతల పనిచేస్తున్నారు...అయితే రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన సరే చింతల వల్ల పీలేరుకు పెద్దగా ఒరిగింది ఏమి లేదనే విమర్శలు వస్తున్నాయి. ప్రభుత్వా పథకాలు ఎలాగో ఎప్పటిలాగానే అందుతున్నాయి..కానీ అభివృద్ధి కార్యక్రమాలే శూన్యం..పైగా ఇక్కడ వైసీపీ నేతల భూ కబ్జాలు పెరిగాయని నల్లారి ఆరోపణలు చేస్తున్నారు...అటు ఇళ్ల స్థలాల్లో అక్రమాలు కూడా ఎక్కువే అని తెలుస్తోంది.

ఈ పరిణామాలు చింతలకు బాగా మైనస్ అవుతున్నాయి. అలాగే పీలేరులో తాగునీరు, సాగునీరు సమస్యలు ఎక్కువే. ఇక టీడీపీ నేత నల్లారి సైతం దూకుడుగా రాజకీయాలు చేయడం మొదలుపెట్టారు. ఇప్పటికే నియోజకవర్గంలో పర్యటిస్తూ ప్రజలకు దగ్గరవ్వడానికి చూస్తున్నారు. అయితే వరుసగా రెండుసార్లు ఓడిపోయిన సానుభూతి నల్లారికి ఎక్కువ ఉంది...అటు ఎమ్మెల్యేగా చింతలకు మంచి మార్కులు పడటం లేదు. ఈ పరిస్తితులని చూసుకుంటే నెక్స్ట్ పీలేరులో నల్లారితో చింతలకు కష్టమే అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: