ఏపీ మంత్రివర్గంలో సరిగ్గా పనిచేయని మంత్రుల విషయంలో డిప్యూటీ సీఎం నారాయణస్వామి ముందు వరుసలో ఉన్నారని, ఇటీవల పలు సర్వేలు వెల్లడించిన విషయం తెలిసిందే. ప్రజావ్యతిరేకత ఎదురుకుంటున్న మంత్రుల్లో నారాయణస్వామి కూడా ఉన్నారని సర్వేలు చెప్పాయి. అయితే సర్వేలు చెప్పినట్లు...నారాయణస్వామి మంత్రిగా ఫెయిల్ అయ్యారా? అంటే కాస్త అవుననే సమాధానాలు ఎక్కువగా వస్తున్నాయి.

ఈ రెండున్నర ఏళ్లలో నారాయణస్వామి అద్భుతమైన పనితీరు కనబర్చినట్లు ఎక్కడా కనబడలేదు. డిప్యూటీ సీఎం హోదా ఉన్న నారాయణస్వామి....ఎక్సైజ్ శాఖ మంత్రిగా ఉన్నారు. అలాగే వాణిజ్య పన్నుల శాఖని కూడా చూసుకున్నారు. కానీ ఇటీవల ఆ శాఖని ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డికి అప్పగించేశారు. అంటే నారాయణస్వామి కింద ఎక్సైజ్ శాఖ ఒక్కటే ఉంది. ఇక మద్యం విషయంలో ప్రభుత్వ పాలసీలు ఎలా ఉన్నాయో చెప్పాల్సిన పని లేదు.

మద్యపాన నిషేధం అని చెప్పి, ఆ హామీని అమలు చేయడంలో పూర్తిగా విఫలమయ్యారు. ఇక నాసిరకం మద్యాన్ని అధిక ధరలకు అమ్ముతున్న విషయం తెలిసిందే. కాబట్టి ఎక్సైజ్ శాఖ పూర్తిగా ఫెయిల్ అయినట్లే కనిపిస్తోంది. సరే ఈ విషయంలో...ప్రభుత్వంది కూడా బాధ్యత ఉంటుంది కాబట్టి.. మంత్రి అనే విషయం వదిలేస్తే...ఎమ్మెల్యేగా నారాయణస్వామి పనితీరు ఎలా ఉందంటే...అది కూడా అంతంత మాత్రమే ఉందని, అవే సర్వేలు చెబుతున్నాయి. గంగాధరనెల్లూరు నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న నారాయణస్వామి...నియోజకవర్గంలో చేసే గొప్ప అభివృద్ధి కార్యక్రమాలు ఏమి లేవని తెలుస్తోంది.

తాగునీరు, సాగు నీరు సమస్యలు,...రోడ్లు, డ్రైనేజ్ సమస్యలు కామన్‌గానే ఉన్నాయి. కాకపోతే ప్రభుత్వం తరుపున కొత్తగా గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, హెల్త్ క్లినిక్‌ల నిర్మాణాలు జరిగాయి...అక్కడక్కడ సిమెంట్ రోడ్ల నిర్మాణాలు జరిగాయి. ఇక నాడు-నేడు ద్వారా కాస్త గంగాధరనెల్లూరులో పాఠశాలలు బాగుపడ్డాయి. పేదలకు ఇళ్ళు నిర్మించి ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది.

కాకపోతే ఒక డిప్యూటీ సీఎం...అంటే నియోజకవర్గంలో భారీగా అభివృద్ధి జరుగుతుందని అంతా అనుకుంటారు. కానీ ఆ స్థాయిలో మాత్రం అభివృద్ధి లేదు. టోటల్‌గా చూసుకుంటే మంత్రిగా, ఎమ్మెల్యేగా నారాయణస్వామి..సక్సెస్ అయితే కాలేదని తెలుస్తోంది. కాకపోతే ఇక్కడ టీడీపీ వీక్‌గా ఉండటమే నారాయణస్వామి ప్లస్

మరింత సమాచారం తెలుసుకోండి: