మేకతోటి సుచరిత....ఏపీ హోమ్ మంత్రి. మరి హోమ్ మంత్రిగా సుచరిత పనితీరు ఎలా ఉందంటే? కాస్త కన్ఫ్యూజన్ ఉంటుందనే చెప్పాలి. బాగుందని చెప్పలేం...బాగోలేదని చెప్పలేం. వైసీపీ వర్షన్‌లో చూసుకుంటే బాగుందని, టీడీపీ వర్షన్‌లో అసలు బాగోలేదనే చెప్పాలి. అదే న్యూట్రల్‌గా ఉండే వారి పరిస్తితి ఏంటి? అంటే..అసలు హోమ్ మంత్రి ఎవరనేది పెద్దగా తెలియదని కూడా చెప్పేస్తున్నారు. ఎందుకంటే రాజకీయాలపై కాస్త అవగాహన ఉన్నవారు...హోమ్ మంత్రి సుచరిత అని చెప్పగలుగుతున్నారు..కానీ మిగిలిన వారికి అంత ఐడియా ఉండదనే చెప్పాలి.

ఇప్పుడు అనే కాదు...గత ప్రభుత్వాల్లో కూడా హోమ్ మంత్రి అంటే...ఎందుకో పెద్దగా ఐడియా ఉండరు. అంటే పేరుకు హోమ్ మంత్రిగా ఉన్నా సరే...అధికారాలు వాళ్ల చేతుల్లో ఉండవని అనుకుంటున్నారో లేక...హోమ్ మంత్రి అంటే ప్రతిపక్ష నాయకులని, కార్యకర్తలని అరెస్టులు చేయడానికే ఉంటున్నారా? అనే డౌట్ కూడా రాక మానదు. అయితే హోమ్ మంత్రిగా సుచరిత పనితీరు ఎలా ఉందనేది ఈ పాటికే ఐడియా వచ్చేయాలి.

సరే హోమ్ మంత్రిగా వదిలేస్తే..ప్రత్తిపాడు ఎమ్మెల్యేగా సుచరిత అదరగొడుతున్నారా? అంటే ఏమో అది కూడా చెప్పడం కష్టమే అని రాజకీయ విశ్లేషకుల నుంచి సమాధానం వస్తుంది. ఎందుకంటే ఈ రెండున్నర ఏళ్లలో ప్రత్తిపాడుని గొప్పగా మార్చేసిన సందర్భం ఏమి లేదని అంటున్నారు. అదిరిపోయే అభివృద్ధి కార్యక్రమాలు కూడా శూన్యమే అంటున్నారు. కాకపోతే ప్రభుత్వం తరుపున జరిగే సంక్షేమ...చిన్నాచితక అభివృద్ధి కార్యక్రమాలు ప్లస్.

గూగుల్‌లోకి వెళ్ళి గుంటూరు జిల్లా ప్రత్తిపాడులో అభివృద్ధి కార్యక్రమాలు అని సెర్చ్ చేసినా సరే...పెద్దగా రిజల్ట్ ఉండదు. ఇక అక్రమాలు అంటే...ఇళ్ల స్థలాలు, ఇసుకలో వైసీపీ నేతల అక్రమాలు తక్కువేమీ కాదని తెలుస్తోంది. అయితే టీడీపీ హయాంలో కూడా ఇక్కడ అక్రమాలు ఎక్కువగానే జరిగాయి. పేరుకు ఎస్సీ రిజర్వడ్ నియోజకవర్గం..కానీ ఇక్కడ ఎమ్మెల్యేలు మారిన...ఎస్సీల తలరాత మాత్రం మారడం లేదు.

రాజకీయంగా చూసుకుంటే సుచరితకు అనుకున్నంత అనుకూలం ఏమి లేదు. అటు టీడీపీ అనుకున్న మేర పుంజుకోలేదు. కాకపోతే ఈ సారి టీడీపీ...సుచరితకు టఫ్ ఫైట్ ఇచ్చేలా ఉంది. ఇదే సమయంలో టీడీపీ-జనసేన గానీ కలిస్తే సుచరితకు నాల్గవ సారి ఎమ్మెల్యేగా గెలిచే అవకాశాలు చాలా చాలా తక్కువ అని చెప్పొచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: