కరోనా కారణంగా ఆర్ధిక వ్యవస్థ అతలాకుతలం అయిపోయింది. దేశవ్యాప్తంగా అనేక చిన్నతరహా మధ్యతరహా కంపెనీలు మూతపడే స్థాయికి చేరుకున్నాయి. ఇలాంటి పరిస్థితులలో దేశంలోని 100 మంది పారిశ్రామిక వేత్తల సంపద కేవలం ఈఆరు నెలలలో 14 శాతం పెరుగుదల చోటు చేసుకున్నట్లు ఫోర్బ్స్ తన తాజా జాబితాలో వెల్లడించింది.


ముఖ్యంగా పారిశ్రామిక దిగ్గజం ముఖేష్ అంబాని సంపద గత ఏడాదితో పోలిస్తే 73 శాతం ఈ సంవత్సరంలోనే అధికమైంది. ప్రస్తుతం ముఖేష్ అంబాని ఆదాయం గంటకు 32 కోట్లు అని అంచనా. అంబాని సంపద రోజుకు 766 కోట్ల స్థాయిలో పెరుగుతోందని ఈ నివేదిక తెలియచేస్తోంది. ఇక ఈ సంపన్నుల లిస్టులో రెండవ స్థాన్నాన్ని గౌతమ్ ఆదాని సంపద ఈ కరోనా కాలంలోనే 61 శాతం పెరగడం అత్యంత ఆశ్చర్యంగా మారింది.


ఇక ముఖ్యంగా గత కొంతకాలంగా హెచ్ సి ఎల్ కంపెనీ షేర్లు విపరీతంగా రాణించడంతో ఈ కంపెనీ వ్యవస్థాపకుడు సివ్ నాడార్ ఆస్థి 20.4 బిలియన్ డాలర్లు పెరిగి సంపన్నుల లిస్టులో మూడవ స్థానానికి చేరుకున్నాడు. అదేవిధంగా కిరణ్ ముజుందార్ సంపద క్రితం ఏడాదితో పోలిస్తే ఈ సంవత్సరం 93 శాతం పెరగడం మార్కెట్ వర్గాలను ఆశ్చర్యాన్ని గురి చేస్తోంది. ఇక భారతదేశంలోని వారంతా ఎంతగానో ఎదురు చూస్తున్న కరోనా వ్యాక్సిన్ తయారీలో ముందువరసలో ఉన్న సీరమ్ ఇన్ స్టిట్యూట్ అధిపతి సైరస్ పూనావాలా సంపద కేవలం ఈ కరోనా సమయంలోనే 26 శాతం పెరిగింది.

ఈ లిస్టులో డాక్టర్. రెడ్డీస్ కుటుంబం మేఘా ఇంజనీరింగ్ పీపీ రెడ్డి కుటుంబం అరవిందో ఫార్మా శ్యాంప్రసాద్ రెడ్డిలు కూడ ఫోర్బ్స్ ఇండియా జాబితాలో అగ్రస్థానంలో కొనసాగుతున్నారు. ఈ కరోనా సమయంలో ఇలా ఎందరో పారిశ్రామిక వేత్తలు మరింత కుభేరులుగా మారుతుంటే బ్రిటానియా ఇండస్ట్రీస్ కు చెందిన నస్లీ వాడియా సంపద అత్యధికంగా 43.67 శాతం తగ్గిపోవడం కొసమెరుపు..

మరింత సమాచారం తెలుసుకోండి: