ప్రతి రూపాయి కూడా దాచి పెట్టుకుంటూ రావడం వల్ల అతి తక్కువ సమయంలోనే..ఎక్కువ మొత్తంలో మనం డబ్బులు పొందవచ్చు అనే ఆలోచన ప్రతి ఒక్కరికి ఉంటుంది.. కానీ దానిని ఆచరణలో పెట్టాలంటే ఇబ్బంది పడుతూ ఉంటారు.. అందుకే ఇప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, బ్యాంకులు, పోస్టాఫీసులు ప్రజల కోసం తీసుకొస్తున్న సరికొత్త పథకాలలో మీరు డబ్బులు ఇన్వెస్ట్ చేస్తూ ఉండడం వల్ల, అతి తక్కువ సమయంలోనే మంచి రాబడిని పొందవచ్చు.. దేశీయ దిగ్గజ సంస్థ అయినటువంటి బ్యాంక్ ఆఫ్ ఇండియా-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇటీవల ఒక సరికొత్త పథకాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది.. ఇందులో మనం పెట్టుబడి పెట్టడం వల్ల నాలుగు లక్షల రూపాయల వరకూ బెనిఫిట్స్ పొందవచ్చు.


స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లో ఖాతా కలిగిన వాళ్లు ప్రతి సంవత్సరం రూ.342 ఇన్వెస్ట్ చేయడం వల్ల రూ. 4 లక్షల వరకు  ప్రయోజనాలను పొందవచ్చు.. అయితే అది ఏలాగో ఇప్పుడు చూద్దాం. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న రెండు రకాల ఇన్సూరెన్స్ స్కీం లలో మనం డబ్బులు ఇన్వెస్ట్ చేయడం వల్ల నాలుగు లక్షల రూపాయల విలువ గలిగిన ప్రయోజనాలను పొందవచ్చు.. అందులో ఒకటి ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన పథకం ఒకటి కాగా..మరొకటి ప్రధాన మంత్రి జీవన జ్యోతి బీమా యోజన పథకం. ఈ రెండూ కూడా పాలసీదారుడు మరణించిన తరువాత ఈ రెండు పథకాల యొక్క ప్రయోజనాలు వారి కుటుంబ సభ్యులకు అందుతాయి.


ఇకపోతే ఈ రెండు పథకాలు మనకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అందుబాటులో ఉన్నాయి.. కాబట్టి కస్టమర్లు ఎవరైనా సరే ఈ పథకాలలో చేరవచ్చు. ఇకపోతే ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన పథకం కింద మీరు రెండు లక్షల రూపాయల ప్రయోజనాన్ని కనుక పొందాలి అనుకుంటున్నట్లు అయితే, ఇందులో మీరు సంవత్సరానికి పన్నెండు రూపాయలు కట్టాల్సి ఉంటుంది. మీరు ఎవరికైతే మీ తదనంతరం డబ్బులు చెల్లాలి అనుకుంటున్నారో.. వారి పేరును నామినీగా పెట్టుకోవాల్సి ఉంటుంది. 70 సంవత్సరాల వయస్సు ఉన్న వాళ్ళు ఇందులో పాలసీ తీసుకోవచ్చు.


జీవన జ్యోతి బీమా యోజన పథకం కింద రెండు లక్షల పొందాలి అంటే దానికి 330 రూపాయలు కట్టాల్సి ఉంటుంది ..ఇలా రెండు పథకాలను కలుపుకొని ఏకంగా 342 రూపాయలను కట్టడం వల్ల నాలుగు లక్షల రూపాయలు ఉచిత బీమా పొందవచ్చు...

మరింత సమాచారం తెలుసుకోండి: