ఆడ పిల్లల భవిష్యత్తు ను ఆలోచించి కేంద్ర ప్రభుత్వం సుకన్య సమృద్ధి యోజన స్కీం తీసుకొచ్చింది. అయితే ఈ సుకన్య సమృద్ధి స్కీం లో మీరు కూడా డబ్బులు పెట్టాలి అని ఆలోచిస్తున్నారా..? లేదంటే ఇప్పటికే అందులో అకౌంట్ ఓపెన్ చేసి డబ్బులు కూడా ఇన్వెస్ట్ చేస్తున్నారా..? అయితే మీరు ఖచ్చితంగా కొన్ని విషయాలను తప్పకుండా గుర్తుంచుకోవాలి. సుకన్య సమృద్ధి యోజన పథకంలో చేరడానికి కేవలం ఆడపిల్లలు మాత్రమే అర్హత పొంది ఉంటారు. అయితే ఇందులో కేవలం పది సంవత్సరాల వయసు లోపు ఉన్న పిల్లలు మాత్రమే చేరాల్సి ఉంటుంది.. ఒక్కొక్క ఇంటికి కేవలం ఇద్దరికి మాత్రమే ఈ స్కీమ్లో చేరేందుకు అవకాశం కూడా కల్పించింది.

ఒకవేళ కవలలు పుడితే ముగ్గురు వరకు సుకన్య సమృద్ధి యోజన పథకంలో చేరవచ్చు. ఇకపోతే ఈ పథకంలో చేరడం వల్ల పలు ప్రయోజనాలు ఉన్నట్లే కొన్ని ప్రతికూలతలు కూడా ఉన్నాయని చెప్పుకోవాలి.. ఈ పథకంలో చేరడం వల్ల మనకు ఎలాంటి నష్టాలు ఉన్నాయో కూడా ఒకసారి తెలుసుకుందాం...

నిజానికి కేంద్ర ప్రభుత్వం ప్రతి మూడు నెలలకు ఒకసారి వడ్డీరేట్లను సమీక్షిస్తూ ఉంటుంది.కాబట్టి వడ్డీరేట్లు అనేవి ఎప్పటికీ స్థిరంగా ఉండదు. మొదట్లో ఈ పథకంపై 9 శాతానికి పైగా వడ్డీ వచ్చేది.. అయితే ఇప్పుడు కేవలం 7.6 శాతం వడ్డీ మాత్రమే మనకు లభిస్తోంది. అంటే క్రమేణా వడ్డీ రేటు తగ్గుతూ వస్తుంది అనే విషయాన్ని ఖాతాదారులు గమనించాలి.

అదే కాదు దీర్ఘకాలంపాటు ఇందులో ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది.. సుమారుగా పదిహేను సంవత్సరాలపాటు డబ్బులు పెట్టాల్సి వచ్చినపుడు, ఒక్కొక్కసారి చేతికి వచ్చే ఆదాయం తగ్గిపోవచ్చు లేదా ఇన్వెస్ట్ చేయడానికి డబ్బులు లేకపోతే ప్రమాదాలు కూడా ఉంటాయి ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది..

ఇక ఈ స్కీం మెచ్యూరిటీ కాలం ఇరవై ఒక్క సంవత్సరాలు.. మధ్యలో డబ్బులు తీసుకోవడానికి ఆస్కారమే లేదు.. ఒక అమ్మాయికి 18 ఏళ్ళు వచ్చిన తరువాత కొంత డబ్బు తీసుకునే అవకాశం ఉంటుంది.. ఈ పథకాన్ని ఆన్లైన్ ద్వారా ఆపరేట్ చేయలేము.. నెట్ బ్యాంకింగ్ సేవలు ఇక అసలుకే పొందలేము.. మనీ ట్రాన్స్ఫర్ కూడా లేదు.. బ్యాంక్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవాలంటే తప్పనిసరిగా బ్యాంకుకి వెళ్లాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: