ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యుత్ వినియోగదారులందరికీ భారీ ఊరట కలిగించే నిర్ణయం తీసుకుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఇప్పటికే ట్రూ అప్ చార్జీల పేరుతో భారీగా వసూలు చేసిన ప్రభుత్వం పై పెద్ద ఎత్తున విమర్శలు వెలువడ్డాయి. ప్రతిపక్ష పార్టీల నాయకులు మాత్రమే కాదు వినియోగదారులు, సామాన్య ప్రజలు సైతం చార్జీల పేరిట భారీ మొత్తంలో వసూలు చేయడంపై పెద్దఎత్తున ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశాయి. అయితే మొన్నటి వరకు వసూలు చేసిన ట్రూ అప్ చార్జీలను తిరిగి చెల్లించడానికి నిర్ణయించుకుంది రాష్ట్ర ప్రభుత్వం.


ఈ మేరకు ఇప్పటికే ప్రక్రియ ప్రారంభం కూడా అయింది.. ఇంధన సర్దుబాటు చార్జీలు అనగా చార్జీలు వసూలు చేసిన డబ్బును విద్యుత్ పంపిణీ సంస్థలు వినియోగదారులకు త్వరలోనే తిరిగి ఇచ్చేస్తున్నాయి.. ఇప్పటి వరకు వసూలు చేసిన ప్రతి రూపాయి కూడా వెనక్కు ఇస్తూ ఉండడం గమనార్హం. నవంబర్ నెలలో వినియోగానికి సంబంధించి డిసెంబర్ నెలలో బిల్లు వేస్తారు కాబట్టి ఈ మేరకు చార్జీలు తగ్గే అవకాశాలు ఉన్నాయి. చార్జీలు కింద వసూలు చేసిన మొత్తాన్ని విద్యుత్ బిల్లులో సర్దుబాటు చేస్తారన్నమాట. మీటర్ రీడింగ్ కాకుండా తగ్గించి ఇస్తూ ఉండడం తో ఈ విషయంపై వినియోగదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

2014 - 2015 సంవత్సరాల నుంచి 2018- 2019 సంవత్సరాలకు సంబంధించిన ఆంధ్రప్రదేశ్ ఏపీ ఈపిడిసిఎల్ , ఏ పీ ఎస్ పి డి సి ఎల్ సమర్పించిన రూ.7,224 కోట్ల చార్జీల పిటీషన్ల ఆధారంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యుత్ నియంత్రణ మండలి.. పోయిన ఆగస్టు 27వ తేదీన రూ.3,669 కోట్ల ఇంధన సర్దుబాటు చార్జీల వసూలుకు అనుమతి ఇవ్వడం గమనార్హం. ఇక మొత్తం రూ.196.28 కోట్ల మేర ఊరట కలుగుతోంది.. ట్రూఅప్ చార్జీల కింద ఏపీ ఈపిడిసిఎల్ పరిధిలో యూనిట్ కు రూ. 0.45 పైసలు,  ఏపీ ఎస్పీడీసీఎల్ పరిధిలో 1.27 పైసలు చొప్పున వినియోగదారుల నుంచి వసూలు చేశారు. మొత్తం ఏపీ ఈపీడీసీఎల్ కింద రూ.126 కోట్లు ఏపీఎస్పీడీసీఎల్ కింద రూ.70 కోట్లు చొప్పున చార్జీలు వసూలు చేయడం జరిగింది. అయితే వీటిని ప్రస్తుతం బిల్లులో సర్దుబాటు చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: