జీవితంలో ప్రతి మనిషి కూడా బరువు , బాధ్యతలు మోసిన తర్వాత రిటైర్మెంట్ పేరిట ఈ బాధ్యతల నుంచి విశ్రాంతి తీసుకోవడం జరుగుతుంది. ఇక ప్రభుత్వ ఉద్యోగాలలో పనిచేసే వారైతే 60 సంవత్సరాలు దాటిన తర్వాత తప్పకుండా రిటైర్మెంట్ తీసుకోవడం తప్పనిసరి. తర్వాత వారు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోకుండా వుండాలి అంటే తప్పనిసరిగా ప్రతి నెలా పెన్షన్ రూపంలో కొంత డబ్బులు రావాల్సి ఉంటుంది. అయితే పదవిలో ఉన్నప్పుడే కొన్ని పథకాలలో డబ్బులు దాచుకోవడం వల్ల పదవి విరమణ తర్వాత ఆర్థికంగా ఇబ్బంది రాకుండా ఉంటుంది.


అయితే ప్రభుత్వ రంగాలు , కొన్ని ప్రైవేటు కంపెనీల లో పనిచేస్తున్న ఉద్యోగులకు రిటైర్మెంట్ తర్వాత పెన్షన్ వస్తుంది కాబట్టి ఎలాంటి ఇబ్బంది ఉండదు కానీ అసంఘటిత రంగాలలో ఉద్యోగం చేసే కార్మికులకు రిటైర్మెంట్ తర్వాత తప్పనిసరిగా ఆదాయం వచ్చే మార్గాన్ని ఎంచుకోవాలి.  ఒకవేళ కాలు, చేయి పనిచేయని పరిస్థితి వస్తే ఇక వారు జీవితం గడపడం అగమ్యగోచరంగా అనిపిస్తుంది. అందుకే ఉద్యోగం లో ఉన్నప్పుడే కొంత మొత్తంలో పథకాలలో డబ్బులు దాచుకోవడం వల్ల రిటైర్మెంట్ జీవితం హ్యాపీగా కొనసాగుతోంది.

అయితే అలాంటి వారికోసం గత రెండు సంవత్సరాల క్రిందట కేంద్ర ప్రభుత్వం కొన్ని పథకాలు అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ పథకంలో ప్రతిరోజు రెండు రూపాయల చొప్పున నెలకు రూ.60 చొప్పున పథకంలో ఇన్వెస్ట్ చేయడం తో నిర్ణీత కాలం ముగిసిన తర్వాత పెన్షన్ రూపంలో ప్రతి నెల మూడు వేల రూపాయలను పొందవచ్చు.ప్రధాన్ మంత్రి శ్రమయోగి మంధన్ యోజన అంటే (PM-SYM. ). ఇప్పటి వరకు ఈ అసంఘటిత రంగానికి చెందిన 45,77,295 మంది కార్మికులు ఈ పథకం కింద నమోదు చేసుకోవడం గమనార్హం.

ఇక ఈ పథకంలో 18 నుంచి 40 సంవత్సరాల మధ్య వయస్సులో ఉన్నవారు చేరాల్సి ఉంటుంది. 18 సంవత్సరాల వయసులో ఈ పథకంలో చేరినప్పుడు నెలకు యాభై ఐదు రూపాయలు చెల్లిస్తే సరిపోతుంది. 19 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు నెలకు వంద రూపాయలు చెల్లించాలి. ఇక 60 సంవత్సరాల తర్వాత నెలకు మూడు వేల రూపాయల చొప్పున ప్రతి నెల పెన్షన్ లభిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: