దేశీయ దిగ్గజం ఇన్సూరెన్స్ కంపెనీ అయినటువంటి లైఫ్ ఇన్సూరెన్స్ ఆఫ్ ఇండియా తాజాగా సరి కొత్త పథకాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది ఇక ఈ పథకంలో మీరు డబ్బులు ఇన్వెస్ట్ చేయడం వల్ల ప్రతి నెల కచ్చితంగా పెన్షన్లు రూపంలో రాబడిని పొందవచ్చు. ఇకపోతే తాజాగా బీమా రంగంలో ఎన్నో ఆఫర్లు ఉన్నాయి.. అందులో వివిధ రకాల స్కీములు కూడా అందుబాటులో ఉండడం గమనార్హం. ఇకపోతే ఎల్ఐసి ప్రవేశపెట్టిన ఎన్నో రకాల పథకాలలో ఎల్ఐసి సరల్ పెన్షన్ యోజన పథకం కూడా ఒకటి. ఈ సరల్ పెన్షన్ యోజన పథకం లో చేరితే ప్రతినెల మీరు ఆదాయాన్ని పొందవచ్చు..


ఇందులో మీరు ఒకేసారి ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది.. ఆ తరువాత ఈ పథకం ద్వారా సంవత్సరానికి 12వేల రూపాయల వరకు పొందే అవకాశం ఉంటుంది.. మీకు వచ్చే పెన్షన్ కూడా మీరు చెల్లించే ప్రీమియం పైన ఆధారపడి ఉంటుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. అయితే ఇందులో రెండు రకాల ఆప్షన్లు మనకు అందుబాటులో ఉన్నాయి.. అందులో ఒకటి టేమో లైఫ్ అండ్ యాన్యుటీ రిటర్న్ ఆఫ్ 100% పర్చేజ్ ప్రైస్ .. ఇందులో ఇన్వెస్ట్ చేయడం వల్ల మీరు జీవించి ఉన్నంతకాలం పెన్షను లభిస్తుంది.. ఒకవేళ మరణిస్తే ఆ తర్వాత ప్రీమియం మొత్తాన్ని పాలసీదారుడు నమోదు చేసిన నామినికి ఇవ్వబడుతుంది.

ఇంకొక ప్లాన్ జాయింట్ లైఫ్ లాస్ట్ సర్వైవర్ యాన్యుటీ రిటర్న్ ఆఫ్ 100% పర్చేజ్ ప్రైస్. భార్య భర్త ఇద్దరూ పథకంలో చేరి నిర్ణీత కాలం ముగిసిన తర్వాత పెన్షన్ రూపంలో పొందవచ్చు  ఒకవేళ ఇద్దరు చనిపోతే ఆ డబ్బులు మొత్తం నామినికి చెల్లిస్తారు.. ఇందులో సంవత్సరానికొకసారి కాకుండా నెలకు, మూడు నెలలకు.. 6 నెలలకు.. వార్షికానికి కూడా పెన్షన్ పొందవచ్చు. 40 నుంచి 80 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న వారు పాలసీలలో   చేరడానికి అర్హులు.. అవుతారు ఇక పూర్తి వివరాలకు మీరు దగ్గర్లో ఉన్న ఎల్ఐసి ఏజెంట్ ను సంప్రదిస్తే వారు అన్ని విషయాలను క్షుణ్ణంగా తెలియజేస్తారు.

మరింత సమాచారం తెలుసుకోండి: