ప్రస్తుతం బ్యాంకులలో ఉండే ఫిక్స్డ్ డిపాజిట్ల పై వడ్డీ రేట్లు  పెరుగుతూనే ఉన్నాయి. ఇక తాజాగా ప్రైవేటు రంగ బ్యాంకుల్లో IDFC  మొదటి బ్యాంకు ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచింది. ఇలా పెంచిన వడ్డీ రేట్లను నిన్నటి రోజు నుంచి అమలులోకి వచ్చేలా చర్యలు తీసుకుంటోంది. వడ్డీ రేటు గా 1 శాతం వరకు పెంచినట్లు తెలియజేసింది. బ్యాంకులో ఇప్పుడు ఫిక్స్డ్ డిపాజిట్లపై కనిష్టంగా. 3.5 శాతం గరిష్టంగా 6.25% వడ్డీ రేట్లను అందిస్తోంది. ఫిక్స్డ్ డిపాజిట్లు మనదేశంలో ఎక్కువగా ఉన్నాయని చెప్పవచ్చు. అయితే వీటి రాబడి మాత్రం స్టాక్ మార్కెట్ పనితీరుపై ఆధారపడి ఉంటుంది.

ఐదు సంవత్సరాల ఒక రోజు నుండి 10 సంవత్సరాల లోపు వరకు ఉండే ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు 6% వరకు ఉంటుంది ఇందులో ఎలాంటి మార్పు అనేది ఉండదట. వీటినే ట్యాక్స్ సేవర్ FD అని కూడా అంటారు . సీనియర్ సిటిజన్లకు అన్ని కాలాల కోసం ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేటును 0.50% ఎక్కువగా ఉంటుంది. ఈ వడ్డీ రేట్లను రెండు కోట్ల వరకు మనం డిపాజిట్ చేసుకోవచ్చు.

మే 1వ తేదీ నుంచి బ్యాంకు పొదుపు ఖాతాలపై వడ్డీ రేట్లను భారీగా పెంచింది. బ్యాంక్ ఇప్పుడు సేవింగ్ ఖాతా బ్యాలెన్స్ పై రూ.1 లక్ష కంటే తక్కువ ఉన్న.. సమానమైన వాటి పైన కూడా 4% వడ్డీ రేట్లను అందిస్తోంది. లక్ష కంటే ఎక్కువ రూ.10 లక్షల వరకు ఉన్న బ్యాలెన్స్ పై వడ్డీ రేటు.. రూ.4 %  వడ్డీరేటును అందిస్తోంది. ఇకపోతే 10 లక్షల నుండి ఐదు కోట్ల వరకు ఫిక్స్ డ్ డిపాజిట్ చేసిన వారికి 6 శాతం వడ్డీని కూడా అందిస్తోంది. ఇకపోతే ప్రైవేటు రుణదాత ప్రస్తుతం ఐదు కోట్ల నుంచి 100 కోట్ల సేవింగ్స్ బ్యాంకు డిపాజిట్ల పై అయిదు శాతం వడ్డీ రేటు మాత్రమే అందిస్తుంది కానీ ఐ డి ఎఫ్ సి ఇలాంటి నిర్ణయం తీసుకోవడం చాలా హర్షదాయకం అని చెప్పవచ్చు. ప్రస్తుతం వడ్డీ రేట్లు బాగా పెరిగిపోయిన నేపథ్యంలో చాలా మంది ఫిక్స్డ్ డిపాజిట్ చేయడానికి ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: