రోజురోజుకు ఇంధన ఖర్చు ఎక్కువవుతున్న నేపథ్యంలో ధరలు కూడా పెరుగుతున్నాయి. ఇకపోతే తాజాగా చమురు కంపెనీలు వినియోగదారులకు భారీగా ఉపశమనాన్ని ఇచ్చాయి .ఇక ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీలు ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరలను భారీగా తగ్గించి వినియోగదారులకు ఊరట కల్పించాయి. ఇకపోతే ఈ మేరకు జూన్ ఒకటవ తేదీ నుంచి సవరించిన ధరల వివరాలను కూడా ఉన్నట్లు సమాచారం. ఇకపోతే డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ల ధరలలో ఎలాంటి మార్పులు చేయలేదు. కానీ వాణిజ్య సిలిండర్ ధరలను భారీగా తగ్గిస్తూ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఉత్తర్వులు జారీ చేసింది.


వాణిజ్య గ్యాస్ సిలిండర్ల ధరలపై 136 రూపాయలు తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అయితే ఈ దశలో నేటి నుంచి అమలులోకి వస్తాయి. ఇదిలా ఉండగా మన దేశ రాజధాని ఢిల్లీలో మాత్రం సబ్సిడీ లేని 14.2 కేజీల డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధర రూ.999.5 ఉండగా ముంబైలో కూడా గ్యాస్ సిలిండర్ ధర రూ.999.5 ఉన్నట్లు సమాచారం. ఇకపోతే కలకత్తాలో 14.2 కేజీలు డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ల ధర రూ.1026 ఉండగా ఇక చెన్నైలో రూ.1015.50 గా ఉన్నట్లు సమాచారం. ఇకపోతే 14 నెలల్లో గ్యాస్ సిలిండర్ ధర సుమారుగా 190 రూపాయలు ఉన్నట్లు సమాచారం.


ఏప్రిల్ 2021 నుండి ఇప్పటివరకు ఎల్పిజి సిలిండర్ ధరలు ఏకంగా 190 రూపాయల పెరిగినట్లు సమాచారం. ఇక ఈ ఏడాది మార్చిలో కూడా ఎల్పిజి సిలిండర్ ధర పై 50 రూపాయలు పెరిగింది అంతకుముందు అక్టోబర్ 6వ తేదీ కూడా 50 రూపాయలు పెరిగింది. ఇకపోతే ఎల్పిజి సిలిండర్ ధర లను చెక్ చేయడానికి.. ప్రభుత్వ యాజమాన్యంలోని చమురు కంపెనీ యొక్క ఐఓసీ వెబ్ సైట్ కి వెళ్లి ఇక్కడ కంపెనీలు ప్రతి నెల కొత్త రేట్లు ఎప్పటికప్పుడు జారీ చేస్తాయి కాబట్టి మీరు కొత్త రోడ్లను తెలుసుకోవచ్చు. ఇక వెబ్ సైట్ ఏమిటంటే..https://iocl.com/Products/IndaneGas.aspx.

మరింత సమాచారం తెలుసుకోండి: