భారతీయులకు పొదుపు అనగానే ముఖ్యంగా గుర్తుకు వచ్చేది పోస్ట్ ఆఫీస్ స్కీమ్ లేదా ఎల్ఐసి వంటి పాలసీలను చెప్పవచ్చు. అందులోనూ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎన్నో ప్రయోజనాలను వివిధ వర్గాల ప్రజలకు కూడా అందిస్తూ ఉన్నది. పిల్లల నుంచి సీనియర్ సిటిజన్స్ వరకు అన్ని వయసుల వారికి కూడా కొన్ని ప్రత్యేకమైన స్కీములు అందుబాటులో ఉంటున్నాయి. అయితే ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నది కేవలం మహిళలు, ఆడపిల్లలు కోసం అందిస్తున్న ఒక స్కీమ్ గురించి తెలుసుకుందాం. ఆ స్కీమ్ ఏమిటంటే lic AADHAAR SHILA PLAN వీటి గురించి పూర్తి వివరాలను తెలుసుకుందాం.

అసలు ఈ ఎల్ఐసి ఆధార్ షిలా పాలసీ అంటే ఏమిటంటే.. ఈ పాలసీలో ప్రతిరోజు రూ.29 రూపాయల చొప్పున పొదుపు చేసుకున్నట్లు అయితే మెచ్యూరిటీ సమయానికి పాలసీదారులకు రూ.4 లక్షల రూపాయలు వస్తాయి. ప్రస్తుతం అతి తక్కువ ధర ప్రీమియంతో అందుబాటులో ఉన్న పాలసీ ఇదే అని చెప్పవచ్చు. అయితే ఇది కేవలం మహిళలు ఆడవాళ్లకు మాత్రమే. ఈ పాలసీ లో చేరడానికి ఆధార్ కార్డు తప్పనిసరిగా ఉండాల్సిందే. దేశవ్యాప్తంగా ఆధార్ తప్పనిసరిగా చేసిన తరువాత అందరూ ఆధార్ కార్డులు ఉపయోగించుకుంటూ ఉంటున్నారు. ఎటువంటి ఆరోగ్య పరీక్షలు లేకుండానే ఈ ఆధార్ శిలా పాలసీని మహిళలు ఉపయోగించుకోవచ్చు.

అయితే ఈ పాలసీలో చేరటానికి కనీస వయసు 8 ఏళ్లుగా నిర్ణయించడం జరిగింది. గరిష్టంగా 55 ఏళ్ల వయసు ఉన్న మహిళలు ఈ పాలసీలో చేరవచ్చు. పాలసీని పదేళ్ల నుండి 20 ఏళ్ల గడువుతో పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. ఎల్ఐసి ఆధార్ షిలా పాలసీలో కనీసం రూ.75,000 నుంచి గరిష్టంగా రూ.3 లక్షల వరకు అందుకొని వెలుసుబాటు ఉన్నది.ఈ పాలసీ ద్వారా నెలవారి, ఆరు నెలలు, ఏడాదికి ఒకసారి ప్రీమియం చెల్లించేందుకు వెలుసుబాటు కూడా కలదు. ఇక ఈ పాలసీ తీసుకున్న మొదటి రోజు నుండి రిస్క్ కవర్ అనే ఒక స్పెషల్ ఫీచర్ అందుబాటులో ఉంటుంది. ఏడాదికి ఒక మహిళ రూ.10,585 రూపాయలు చొప్పున కట్టినట్లు అయితే 20 ఏళ్లకు దాని విలువ రూ.2.14,698 లక్షలు అవుతుంది. ఆ తర్వాత పాలసీదారునికి రూ.3,97,000 లక్షల వరకు రాబడి.

మరింత సమాచారం తెలుసుకోండి: