దేశీయ దిగ్గజ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తాజాగా పలు రకాల పాలసీలను తీసుకొస్తున్న నేపథ్యంలో రోజురోజుకు ఇందులో చేరే వారి సంఖ్య కూడా ఎక్కువవుతుంది. ముఖ్యంగా ఎల్ఐసి లో అనేక ప్రయోజనాలు ఉండే పాలసీలు కూడా చాలా రకాలు ఉన్నాయి. ముఖ్యంగా ఎల్ఐసి లో బాగా ప్రజాదారణ పొందిన ప్లాన్లు కూడా ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఎల్ఐసి జీవన్ లాబ్ పాలసీ కూడా ఒకటి. ఇక దీనిని 2020 ఫిబ్రవరి ఒకటో తేదీన ప్రారంభించారు ఇక నాన్ లింక్డు పరిమిత ప్రీమియం చెల్లింపు ప్లాన్లలో ఇది కూడా ఒకటి. ఇందులో పాలసీదారుడు రక్షణతో పాటు పొదుపు ప్రయోజనం కూడా పొందే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మెచ్యూరిటీకి ముందే పాలసీదారుడు మరణిస్తే అతడి డబ్బుని నామినీ కి అందిస్తారు.


మెచ్యూరిటీ అయిపోయిన తర్వాత ఒకేసారి మొత్తం మీకు అందుబాటులో ఉండే అవకాశం ఉంటుంది. ఇక ఈ పాలసీలో రుణ సదుపాయం కూడా అందుబాటులో ఉన్న నేపథ్యంలో ఎనిమిది సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న చిన్నపిల్లలు ఈ పథకంలో చేరడానికి అనర్హులు. ఇక ఈ ఎల్ఐసి పాలసీ మూడు పీరియడ్లతో మనకు అందుబాటులో ఉంది.16, 21,25 సంవత్సరాల వ్యవధిలో తీసుకోవచ్చు. ఇక గరిష్టంగా 59 సంవత్సరాల వయసు ఉన్నవారు పాలసీ తీసుకుంటే సరిపోతుంది.
ఇకపోతే ఈ పాలసీలో కనిష్టంగా రెండు లక్షల రూపాయలను పెట్టుబడిగా పెట్టాలి. గరిష్టంగా పరిమితులు లేవు.

ఇకపోతే మీరు 20 లక్షల రూపాయల బీమా మొత్తాన్ని పొందాలి అనుకుంటే ప్రతిరోజు 251 రూపాయలు చొప్పున ఎల్ఐసి జీవన్ లాభ్ పాలసీలో 16 సంవత్సరాల పాటు పన్నుతో సహా ప్రీమియం చెల్లించాలి. ఇక అప్పుడు మెచ్యూరిటీ తర్వాత అంటే 17వ సంవత్సరంలో మీరు 20 లక్షల రూపాయలను పొందవచ్చు. ఇక అంతే కాదు మూడు హెల్త్ ప్లాన్లు, 11 ఎండోమెంట్,  9 మనీ బ్యాక్ ప్లాన్లు కూడా అందుబాటులో ఉన్నాయి. ఇక మరింత సమాచారం కోసం మీరు దగ్గర్లో ఉన్న బ్యాంకులకు వెళ్లి పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు..

మరింత సమాచారం తెలుసుకోండి: