ఇటీవల కాలంలో పోస్ట్ ఆఫీస్ లో తమ కస్టమర్ల కోసం అత్యద్భుతమైన పథకాలను అందుబాటులోకి తీసుకొస్తున్న విషయం తెలిసిందే.ఇక అలాంటి వాటిలో రిస్క్ లేకుండా మంచి రిటర్న్స్ మీరు పొందాలి అనుకుంటే కచ్చితంగా పోస్ట్ ఆఫీస్ ప్రవేశపెడుతున్న పథకాలలో ఇన్వెస్ట్ చేయడం తప్పనిసరి. ఇకపోతే ముఖ్యంగా రిస్క్ లేకుండా లాభాలను అందించే పథకాల విషయానికొస్తే పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ , సీనియర్ సిటిజన్స్ సేవింగ్ స్కీం, నేషనల్ సేవింగ్ సర్టిఫికెట్ లాంటి పథకాలు చాలా అద్భుతంగా లాభాలను అందిస్తాయి. 2022 జూలై నుంచి సెప్టెంబర్ మధ్య వడ్డీ విషయంలో ఎలాంటి మార్పులు కేంద్ర ప్రభుత్వం చేయలేదు. కాబట్టి పాత వడ్డీ ఈ పథకాలపై అమలులో ఉంది. ఇకపోతే పోస్ట్ ఆఫీస్ ప్రవేశపెట్టిన ఈ నేషనల్ సేవింగ్ సర్టిఫికెట్ పథకంపై ఇన్వెస్టర్లకు మంచి లాభాలు అందుతున్నాయి .


నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ షార్ట్ టర్మ్ ఇన్వెస్టర్లకు అత్యధిక లాభాలు అందిస్తోంది అని చెప్పడంలో సందేహం లేదు. కేవలం ఐదు సంవత్సరాల లోనే మీరు మంచి రిటర్న్స్ పొందవచ్చు. ఇక నేషనల్ సేవింగ్ సర్టిఫికెట్ పథకంలో మీరు 6.8% వడ్డీ కూడా పొందుతారు. ముఖ్యంగా మధ్యతరగతి ప్రజలకు ఇది ఒక బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ స్కీమ్ అని చెప్పవచ్చు. ఇక ప్రతి మూడు నెలలకు ఒకసారి చిన్న మొత్తాల పొదుపు పథకాలపై వడ్డీరేట్లు కేంద్ర ప్రభుత్వం సవరిస్తూ ఉంటుంది. కాబట్టి వడ్డీ విషయంలో కొంచెం జాగ్రత్త పడాల్సి ఉంటుంది. ఇక 80సీ సెక్షన్ కింద పన్ను మినహాయింపు పొందే అవకాశం కూడా ఉంటుంది. ఇకపోతే ఈ పథకంలో చేరడానికి కనీసం 1000 రూపాయలు అంటే సరిపోతుంది. ఆ తర్వాత 100 రూపాయల చొప్పున జోడిస్తూ ఎంతైనా మీరు జమ చేసుకోవచ్చు.

ఇకపోతే ఇందులో మీరు ఎంత ఇన్వెస్ట్మెంట్ చేసినా సరే ఐదు సంవత్సరాల వరకు ఎదురు చూడక తప్పదు 6.8% వడ్డీ కూడా లభిస్తుంది కాబట్టి ఒకేసారి మీరు రెండు లక్షల రూపాయలను పొదుపు చేసి వదిలేస్తే చివర్లో రూ.77,899 వడ్డీ కలుపుకొని.. మొత్తంగా రూ.2,77,899 లభిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: