దేశంలోనే దిగ్గజ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా.. ఎప్పటికప్పుడు దేశంలోనే అట్టడుగు వర్గాల ప్రజలను ఇబ్బందుల నుండి బయట పడేసే మార్గాలను వెతుకుతూ ఉంటుంది. ఈ క్రమంలోనే వారికి కావలసిన అద్భుతమైన పథకాలను అందుబాటులోకి తీసుకొచ్చి అతి తక్కువ సమయంలోనే వారి ఆర్థిక ఇబ్బందులు అన్నిటిని కూడా తీర్చే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఇకపోతే ఎల్ఐసి ఇప్పుడు తన దృష్టిని విద్యార్థుల వైపు మరల్చింది అని చెప్పవచ్చు. ఇప్పటికే ఎంతోమంది విద్యార్థులు ఆర్థికంగా ఇబ్బంది పడుతూ.. తమ చదువుల విషయంలో మరిన్ని సమస్యలను ఎదుర్కొంటున్నారని , తమ దృష్టికి రావడంతో ఇప్పుడు విద్యార్థుల కోసం సరికొత్త స్కాలర్షిప్ స్కీంను ప్రవేశపెట్టింది.

తాజాగా హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ విద్యాధన్  స్కాలర్షిప్ పేరుతో స్కాలర్షిప్ అందించడానికి సిద్ధంగా ఉంది. ఇకపోతే చాలామంది విద్యార్థులు ప్రతిభ ఉండి ఆర్థిక పరిస్థితుల కారణంగా ఉన్నత చదువులు చదవలేక పోతున్న పేద విద్యార్థులకు ఎల్ఐసి ఇప్పుడు ఒక స్కాలర్షిప్ అందించడానికి సిద్ధమయింది. ఇందుకు కావలసిన అర్హతలు ఏమిటి అనే విషయానికి వస్తే.. విద్యాధన్ స్కాలర్షిప్.. ఇంటర్ మొదటి సంవత్సరం, డిగ్రీ మొదటి సంవత్సరం అలాగే పోస్ట్ గ్రాడ్యుయేషన్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు ఈ స్కాలర్షిప్ ను అందిస్తారు. ముఖ్యంగా అభ్యర్థులు ముందు తరగతిలో 60 శాతం మార్కులను కచ్చితంగా సాధించి ఉండాలి.

ఇక అలాగే సంవత్సర ఆదాయం కుటుంబానికి రూ.3,60,000 కి మించకూడదు. ముఖ్యంగా ఈ స్కాలర్షిప్ కు ఎంపికైన ఇంటర్ విద్యార్థులకు సంవత్సరానికి రూ.10,000 చొప్పున రెండు సంవత్సరాలు అందజేస్తారు. అలాగే డిగ్రీ విద్యార్థులకైతే ఏడాదికి రూ.15,000 చొప్పున మూడు సంవత్సరాల అందజేస్తారు. ఇక పీజీ విద్యార్థులకు అయితే ఏడాదికి రూ.20,000 చొప్పున రెండు సంవత్సరాలు ఎల్ఐసి వాళ్ళు అందజేస్తారు. ఇక ఆసక్తి ఉన్న,  అర్హత ఉన్న విద్యార్థులు ఆన్లైన్ ద్వారా సెప్టెంబర్ 30 వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలి. ఇక ఎల్ఐసి అధికారిక వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకొనే అవకాశం కల్పించబడింది.

మరింత సమాచారం తెలుసుకోండి: