మీరు చాలా బాగా మాట్లాడుతారా..ఎవరినైనా సరే మీ మాటలతో ఇట్టే పడేస్తారా..అయితే మీకు ఒక బిజినెస్ ఐడియా మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఈరోజుల్లో మాటలు మాట్లాడే వారికి అందరూ ఆకర్షితులవుతారని బాగా తెలుసు. అందుకే మీరు కూడా బాగా మాట్లాడే వారైతే మీ పని మరింత సులువుగా అయిపోతుంది. ఇక మీ మాటలనే మీరు బిజినెస్ గా పెట్టి మీ ఆదాయాన్ని పెంచుకోవచ్చు. ఇకపోతే ఒకప్పుడు మధ్యవర్తులు నిర్వహిస్తున్న విధులను నేడు మ్యారేజ్ బ్యూరోలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. కేవలం చాలా పెళ్లిళ్లు మ్యారేజ్ బ్యూరోలు నిర్వహిస్తున్న సంబంధాల ద్వారానే జరుగుతున్నాయి. ఇది కేవలం పెళ్లిళ్లు కుదిరించడం మాత్రమే కాదు ఒక గొప్ప వ్యాపారం అని కూడా చెప్పవచ్చు.


ఈ వ్యాపారంలో మీరు మంచి ఆదాయాన్ని సంపాదించే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మ్యారేజ్ బ్యూరో అంటే ఆధునిక మధ్యవర్తులు అని అర్థం చేసుకోవాలి. ఇకపోతే ఈ బ్యూరోలు రెండు పార్టీలకు అబ్బాయి లేదా అమ్మాయి సంబంధించిన మొత్తం డేటాను అందివ్వడం జరుగుతుంది. ఇక వివాహం నిశ్చయమైన తర్వాత రెండు పార్టీల నుంచి కమీషన్ తీసుకోవడం జరుగుతుంది.కాబట్టి మ్యారేజ్ బ్యూరో ప్రారంభించడానికి మీకు ఒక గది అలాగే హాల్ లాంటి వసతులు ఉంటే సరిపోతుంది. సుమారుగా ఒక ఐదు మంది సులభంగా కూర్చోగలిగే స్థలం ఉండి ఆకర్షించగలిగిన వాతావరణ ఉన్నట్లయితే మీరు మొదలుపెట్టిన వ్యాపారానికి ఆకర్షితులవుతారు.

ముఖ్యంగా మ్యారేజ్ బ్యూరో ని ప్రారంభించాలనుకునే వారికి మంచి సంభాషణ నైపుణ్యం ఉండాలి. మీ మౌత్ పబ్లిసిటీ ద్వారా ఎంతోమందికి సంబంధాలు కుదురుస్తారు. ముఖ్యంగా 100 అబద్ధాలాడైనా ఒక పెళ్లి చేయాలనేది పెద్దల సామెత. అంటే చిన్న చిన్న సమస్యలు వచ్చినా సరే నచ్చచెప్పే కెపాసిటీ మీలో ఉండాలి అప్పుడే మీరు ఈ న్యూ మ్యారేజ్ బ్యూరో ని మొదలు పెట్టవచ్చు. ఇక మీరు బ్యూరో మొదలుపెట్టినట్లయితే రిజిస్ట్రేషన్ ఫీజు రూ. 500 నుండి రూ.2500 వరకు నిర్ణయించవచ్చు.  మీ కమిషన్ రూ.5000 నుంచి రూ.50 వేల రూపాయల వరకు ఉంటుంది. అంటే మీరు కుదుర్చే వివాహం రేంజిని బట్టి మీ కమీషన్ కూడా ఉంటుందని గుర్తించుకోవాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: