అనవసరమైన ఖర్చులను తగ్గించుకొని ప్రతిరోజు 200 రూపాయలు ఆదా చేస్తే 20 సంవత్సరాల లోనే మీరు లక్షాధికారి కావచ్చు. కాబట్టి పొదుపు చేయడం అనేది భవిష్యత్తుకు మంచి చేకూరుస్తుందని గుర్తించుకోవాలి. మరి ప్రభుత్వరంగం ప్రవేశపెట్టిన ఆ పథకం గురించి ఒకసారి మనం చదివి తెలుసుకుందాం.

ప్రస్తుతం పొదుపు చేయడానికి పోస్ట్ ఆఫీస్లు,  బ్యాంకులో రకరకాల పథకాలను ప్రవేశపెడుతున్నాయి అందులో ఎక్కువ వడ్డీ వచ్చే పథకాలు కూడా ఉన్నాయి. బ్యాంకులో కంటే పోస్ట్ ఆఫీస్ లో డబ్బు పొదుపు చేస్తే ఎక్కువ వడ్డీ లభిస్తుంది. ఇక అలాంటి వాటిని మీరు ఐడెంటిఫై చేసి అందులో డబ్బులు పెడితే మంచి రాబడి వస్తుంది. ఇక అలాంటి వాటిలో పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ కూడా ఒకటి . పోస్ట్ ఆఫీస్ ప్రవేశపెట్టిన ఈ పథకంలో మీరు పెట్టుబడి పెడితే 20 సంవత్సరాల తిరిగేలోపు 32 లక్షల రూపాయల ఫండ్ క్రియేట్ అవుతుంది అని గుర్తుంచుకోవాలి. ఇకపోతే మీరు డబ్బు ఎక్కువగా సంపాదించాలి అంటే ప్రతిరోజు పొదుపు చేయాల్సి ఉంటుంది..

ప్రతిరోజు 200 రూపాయల చొప్పున నెలకు 6000 రూపాయలను మీరు  సంపాదించే డబ్బులలో  పోస్ట్ ఆఫీస్ లో పెట్టుబడిగా పెడితే 20 సంవత్సరాలలో మీరు లక్షాధికారి అవ్వచ్చు. ఇక పబ్లిక్ పార్లమెంట్ అనేది దీర్ఘకాలిక పొదుపు పథకం కాబట్టి దీనిపై 7.1% అధికంగా వడ్డీ కూడా లభిస్తుంది.ఇక మీరు పోస్ట్ ఆఫీస్ కి వెళ్లి పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ ఖాతా గురించి పూర్తిగా తెలుసుకొని .. ఖాతా ఓపెన్ చేయవచ్చు. ముఖ్యంగా మీ దగ్గర ఖాతా తెరవడానికి కేవలం 500 రూపాయలు ఉంటే సరిపోతుంది. ఇందులో రూ.1.50 లక్షల వరకు డిపాజిట్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇక అంతేకాదు ఈ ఖాతా మెచ్యూరిటీ కాలం 15 సంవత్సరాలు కాగా.. మీరు మరో ఐదు సంవత్సరాల వరకు మెచ్యూరిటీ తర్వాత పొడిగించుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: