ఆంధ్రప్రదేశ్ లో ఉన్న కాపు మహిళలకు వైఎస్ఆర్ కాపు నేస్తం పథకం కింద ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ముఖ్యంగా కాపు మహిళలకు సీఎం జగన్ సహాయం అందించడానికి సిద్ధంగా ఉన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ఈ పథకంలో భాగంగా ముఖ్యమంత్రి స్వయంగా మూడో విడత పంపిణీ చేయనున్నట్లు సమాచారం. రేపు కాకినాడ జిల్లాలో సీఎం జగన్ పర్యటించిన నేపథ్యంలో పిఠాపురం నియోజకవర్గం లోని గొల్లప్రోలు నగర పంచాయతీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొని కాపు నేస్తం లబ్ధిదారులకు నిధులు విడుదల చేయనున్నారు.


ఇక కాపు నేస్తం లబ్ధిదారులకు సహాయాన్ని విడుదల చేయనున్న నేపథ్యంలో కాపు సామాజిక వర్గంలోని ఉప కులాలకు చెందిన బలిజ, కాపు, ఒంటరి , తెలగా వర్గాలకు చెందిన మహిళలకు ఈ సహాయం అందబోతోంది. 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల లోపు ఉన్న మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం రూ.15,000 చొప్పున ఆర్థిక సహాయాన్ని అందిస్తున్న నేపథ్యంలో మహిళల ఖాతాలో నేరుగా ఈ డబ్బులు జమ చేయనున్నారు. ఇక జమ అయిన వెంటనే ఒక మెసేజ్ కూడా వస్తుంది అని వైయస్సార్ కాపు నేస్తం పథకం కింద సుమారుగా కొన్నివేల మంది మహిళలు లబ్ధి పొందుతున్నట్లు సమాచారం . ఇక కాపు నేస్తం కింద ప్రతి సంవత్సరం 490 కోట్ల రూపాయలు వెచ్చిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం.


ఇక ఎన్నికల సమయంలో భాగంగానే హామీ ఇచ్చిన వైయస్సార్ పార్టీ ఇప్పుడు కాపు నేస్తం పథకం ద్వారా ఐదేళ్ల పాలనలో 75 వేల రూపాయలను ఆర్థిక సహాయంగా అందించనున్నారు.ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉండే మహిళలు రూ.10,000 పట్టణ ప్రాంతాల్లో ఉండే మహిళలు రూ.12 వేల లోపు నెలసరి ఆదాయం ఉండాలి. ఇక అలాగే స్థిరాస్తులు విషయంలో కూడా పరిమితులు ఉన్నాయి. మొత్తానికైతే వైయస్ జగన్మోహన్ రెడ్డి అక్క చెల్లెమ్మలకు చేస్తున్న సహాయాన్ని చూసి అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: