ముఖ్యంగా మన భారత దేశంలో వయసు తో సంబంధం లేకుండా చిన్నవారి నుంచి పెద్దవారి వరకు డయాబెటిస్ అలాగే బిపి బారిన పడుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో శారీరక శ్రమ లేకపోవడం.. ఒకే చోట కూర్చొని లేదా నిల్చోని ఏకధాటిగా గంటల తరబడి పని చేయడం, ఒత్తిడి, మానసిక ఆందోళన, ఆహారంలో మార్పులు, జీవనశైలిలో ఇబ్బందులు ఇలా పలు కారణాలవల్ల చాలామంది ఇలా డయాబెటిస్, అధిక రక్తపోటు వ్యాధులకు గురి అవుతున్నారు. ఎప్పుడు తమ ప్రాణాలను కోల్పోతారో కూడా చెప్పడం చాలా కష్టం. ఎందుకంటే ఇది దీర్ఘకాలిక వ్యాధులు మాత్రమే కాదు క్రమంగా మన శరీరంలోని అవయవాలను కూడా నెమ్మదిగా దెబ్బతీస్తాయి. ఇక ఒక్కసారిగా ప్రాణం పోతుంది అని చెప్పవచ్చు.


ఇకపోతే భారతదేశంలో ఎక్కువగా అధిక రక్తపోటు, డయాబెటిస్ సమస్యలతో బాధపడుతున్న వారి సంఖ్యను దృష్టిలో పెట్టుకొని తాజాగా నివా బుపా హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ స్మార్ట్ హెల్త్ ప్లస్ డిసీజ్ మేనేజ్మెంట్ ప్లాన్ తీసుకొచ్చింది. ముఖ్యంగా ఈ కొత్త రైడర్ ప్లాన్ లో ఒకటవ రోజు నుంచి మధుమేహం,  రక్త పోటు సంబంధిత సమస్యలకు కవరేజీని అందిస్తూ ఉండడం గమనార్హం. ముఖ్యంగా రీ అష్యూర్ ప్లాన్ కోసం సైన్ అప్ చేసేవారికి రైడర్ అందుబాటులో ఉంటుంది అని ఆ కంపెనీ ప్రకటించింది. ఇక డయాబెటిస్,  బిపి తో బాధపడేవారు ఆసుపత్రిలో చేరే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది .కాబట్టి వారికి తక్షణమే కవరేజ్ అందేలాగా ఈ ప్లాన్ తీసుకురావడం జరిగింది. Lరోగులు ఆందోళన చెందకుండా ఉండడం కోసమే ఈ సరికొత్త కవరేజ్ ప్లాన్ తీసుకొచ్చామని కంపెనీ కూడా తెలిపింది.

ఈ ప్లాన్ తీసుకున్న వారు హెల్త్ ఇన్సూరెన్స్ రెన్యువల్ ప్రీమియంపై 20 శాతం వరకు తగ్గింపును కూడా పొందుతారు. ఇక డబ్బులు లేక ఇబ్బంది పడే ఎంతోమంది ఈ పాలసీని తీసుకొని మొదటి రోజు నుంచే  లాభం పొందవచ్చని కంపెనీ వెల్లడించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: