కేంద్ర ప్రభుత్వం రైతులను.. వారి ఆర్థిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని పీఎం కిసాన్ పథకం కింద డబ్బులను జమ చేస్తున్న విషయం తెలిసిందే. ఇక రైతులు ఎదురుచూస్తున్నటువంటి పీఎం కిసాన్ సంబంధించిన  డబ్బులు త్వరలోనే వారి ఖాతాలో జమ కానున్నాయి. ఇక ప్రతి సంవత్సరం కేంద్రం దేశవ్యాప్తంగా అర్హులైన రైతులకు పెట్టుబడి సాయంగా 6000 రూపాయలను మూడు విడుదలగా పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే 11వ విడత డబ్బులను రూ.2000 చొప్పున రైతుల ఖాతాల్లోకి కేంద్ర ప్రభుత్వం జమ చేసింది. ఇక ఇప్పుడు 12వ విడత డబ్బులు ఎప్పుడు కేంద్ర ప్రభుత్వం రైతుల ఖాతాల్లోకి జమ చేస్తుంది అంటూ రైతులు ఎదురుచూస్తున్నారు.

2021లో  10వ విడతకు సంబంధించి డబ్బులు ఆగస్టు నెలలోనే జమ అయ్యాయి.. అయితే ఈసారి ఇంకా రెండు వారాలు గడిచినప్పటికీ పీఎం కిసాన్ డబ్బుల గురించి ఎక్కడ ప్రస్తావన రాకపోయేసరికి రైతులలో కొంతవరకు ఆందోళన వ్యక్తం అయింది. కానీ ఎట్టకేలకు అధికారుల స్పందించి 12వ విడత డబ్బులను పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద ఆగస్టు 31 లేదా సెప్టెంబర్ ఒకటో తేదీ లోపు కచ్చితంగా రైతుల ఖాతాలో జమ చేస్తాము అని అధికారికంగా ప్రకటించారు. ఇక రైతులు ఎటువంటి ఇబ్బందులు పడకుండా 2 వేల రూపాయలను పెట్టుబడి సాయంగా కేంద్ర ప్రభుత్వం జమ చేయనుంది. మిగతా 2000 రూపాయలను అక్టోబర్ లేదా డిసెంబర్ నెలలో జమ చేసే  అవకాశము ఉందని సమాచారం.

రైతులు పెట్టుబడి కూడా పెట్టలేని సందర్భాలలో పంటలు వేయడం కష్టంగా భావిస్తున్న సమయంలో ఇలా ఆరువేల రూపాయలను సంవత్సరానికి అందిస్తూ రైతును ఆదుకోవడానికి ముందుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం. ఈ నేపథ్యంలోని 12వ వడత డబ్బులు కూడా ఆగస్టు 31వ తేదీ లోపు రైతుల ఖాతాలో జమ అవుతాయని సమాచారం. ఈ విషయం తెలుసుకున్న రైతులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: