ప్రపంచ ఇంధన ధరలు ఆరు నెలల కనిష్టానికి పడిపోవడంతో ప్రస్తుతం ఇండియన్ కరెన్సీ రూపాయికి ఉత్సాహం వచ్చింది. ఇక డాలర్ మారకంలో రూపాయి ఒక్కసారిగా 44 పైసలు జంప్ చేసిందని చెప్పవచ్చు. ఇక బుధవారం ట్రేడింగ్ ఆరంభంలో రూపాయి 79.32 కి చేరుకుంది. ఇక శుక్రవారం సెషన్ లో అమెరికా డాలర్ తో రూపాయి మారకం విలువ 12 పైసలు క్షీణించి 79.74 వద్ద ముగిసింది. ఇక ప్రపంచ చమూరు బెంచ్ మార్క్ బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ బ్యారల్ కి ఆరు నెలల కనిష్ట స్థాయి నుండి కోలుకుందనే చెప్పాలి. నిజానికి వంట ధరలు పెరిగిపోతున్న నేపథ్యంలో సామాన్య ప్రజలు చాలా ఇబ్బందికరంగా తమ జీవితాన్ని కొనసాగిస్తున్నారు.


నిత్యవసర సరుకుల ధరలు సామాన్యుడికి అత్యంత భారంగా మారిపోయింది. బుధవారం 0.34 శాతం పెరిగి 92.65 డాలర్లకు చేరుకుంది ఇక డాలర్ ఇండెక్స్ 0.06% క్షీణించి..106.44 కి చేరుకుంది ఇక అలాగే విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు మంగళవారం క్యాపిటల్ మార్కెట్లో నికర కొనుగోలుదారులుగా ఏర్పడ్డారు. ఒక మంగళవారం ఎక్స్చేంజి డేటా ప్రకారం రూ.1,376.84 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేయడం జరిగింది. ఇక ఆగస్టు మొదటి రెండు వారాల్లో రూ.22,452 కోట్ల మేర కొనుగోలు చేయడం గమనార్హం. ఇక దీంతోపాటు ద్రవ్యోల్బణ ఒత్తిళ్ల మధ్య దేశ ఈక్విటీలలో జోరు.. ఫారెక్స్ పెట్టబడిదారుల దృష్టిని సానుకూలంగా మార్చింది అని ఇటీవల ఫారెక్స్ డీలర్లు కూడా వెల్లడించారు.

ఈక్విటీ మార్కెట్లో కొనుగోలుదారుల మద్దతుతో సెన్సెక్స్ 60 వేల వద్ద ,నిఫ్టీ 18 వేల వైపు పరుగులు తీస్తోంది. ఇక ఇండిపెండెన్స్ డే, పార్సీ నూతన సంవత్సర సందర్భంగా ఫారెక్స్ మార్కెట్లో వరుసగా సోమవారం,  మంగళవారం రోజు పనిచేయలేదు. ఇకపోతే క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గినప్పటికీ ప్రజలలోకి వచ్చేసరికి ట్యాక్స్ పేరిట ధరలు ఈక్వల్ చేస్తున్నారు అంటూ వినియోగదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ విషయాలపై అటు సెంట్రల్ గవర్నమెంట్ ఇటు స్టేట్ గవర్నమెంట్ ఎలా స్పందిస్తుందో తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: