ప్రముఖ ప్రైవేట్ బ్యాంక్ అయిన ఐసిఐసిఐ బ్యాంక్ తాజాగా ఫిక్స్ డిపాజిట్ ల పై వడ్డీ రేట్లు సవరించింది. ముఖ్యంగా రూ.2 కోట్ల నుంచి రూ.5 కోట్లలోపు చేసే ఫిక్స్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు తాజాగా సవరించినట్లు బ్యాంకు అధికారిక వెబ్సైట్లో పేర్కొనడం జరిగింది. ఇక కొత్త వడ్డీ రేట్లు 2022 ఆగస్టు 26వ తేదీ నుంచి అమలులోకి వచ్చాయి. ఇప్పుడు ఈ బ్యాంకు ఏడు రోజుల నుంచి పది సంవత్సరాల వరకు మెచ్యూరిటీతో అందించే ఫిక్స్ డిపాజిట్ లపై 3.50 శాతం నుంచి 5.90 శాతం వరకు వడ్డీ రేటును అందిస్తోంది. ఇక ప్రస్తుతం సవరించిన వడ్డీ రేట్లు ఎలా ఉన్నాయో ఇప్పుడు ఒకసారి చదివి తెలుసుకుందాం..


ఏడు రోజుల నుంచి 29 రోజుల్లో మెచ్యూర్ అయ్యే ఫిక్స్డ్ డిపాజిట్ ల పై 3.50 శాతం వడ్డీ రేటును అందిస్తోంది. ఇక 30 రోజుల నుంచి 45 రోజుల్లో మెచ్యూర్ అయ్యే టర్మ్ డిపాజిట్ లపై బ్యాంకు  3.60 శాతం వడ్డీ రేటును అందిస్తోంది.  60 రోజుల వరకు మెచ్యూర్ అయ్యే ఫిక్స్డ్ డిపాజిట్ లపై 4.00 శాతం నుండి వడ్డీరేట్లు మొదలవుతాయి. ఇక 61 రోజుల నుంచి 90 రోజుల మధ్య  మెచ్యూర్ అయ్యే టర్మ్ డిపాజిట్ ల పై 4.75% వడ్డీ లభిస్తుంది. ఇక 91 రోజుల నుంచి 184 రోజుల వరకు మిస్చూరిటీ ఉండే ఫిక్స్డ్ డిపాజిట్ల మీద 5.25% వడ్డీని ఆఫర్ చేస్తోంది.


ఇకపోతే 221 రోజుల నుంచి ఒక సంవత్సరంలోపు మెచ్యూర్ అయ్యే ఫిక్స్ డిపాజిట్ల పైన 5.60% వడ్డీ లభిస్తుంది. ఇక ఐదు సంవత్సరాలలో మిస్ యు రైల్వే ఫిక్స్ డిపాజిట్లపై 6.05% వడ్డీ రేటు లభిస్తోంది 10 సంవత్సరాల వరకు మెచ్యూరిటీ ఉండే ఫిక్స్ డిపాజిట్ లపై 5.90 శాతం వడ్డీ కూడా లభిస్తుంది. ఇక సీనియర్ సిటిజనులకు 6.60 శాతం వరకు వడ్డీ లభిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: