దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయినటువంటి బ్యాంక్ ఆఫ్ ఇండియా-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎప్పటికప్పుడు తమ కస్టమర్ల కోసం రకరకాల సేవలను అందుబాటులోకి తీసుకొస్తున్న విషయం తెలిసిందే.
 ఇక ఈ క్రమంలోనే తాజాగా మరొక సేవను కూడా తన కష్టమర్ల కోసం అందుబాటులోకి తీసుకువచ్చింది ఎస్బిఐ. ఇక కేవలం ఒక్క మెసేజ్ తో ఫాస్ట్ ట్యాగ్ బ్యాలెన్స్ ను చెక్ చేసుకునే సర్వీస్ ను లాంచ్ చేసింది. ఇక దీని ద్వారా ఎస్బిఐ కస్టమర్లు ఫాస్ట్ ట్యాగ్ బ్యాలెన్స్ ను  సెకండ్లలో తెలుసుకునే అవకాశం ఉంటుంది.  ఇక ఇందులో ఫాస్ట్ ట్యాగ్ ని ఉపయోగించే ఎస్బిఐ కస్టమర్లు  ఈ సేవను  వినియోగించుకోవచ్చని ఎస్బిఐ ప్రకటించింది

ఇకపోతే ఫాస్ట్ ట్యాగ్ ని ఉపయోగించే ఎస్బిఐ కస్టమర్లు వారు రిజిస్టర్ అయిన నంబర్ నుంచి 72088 20019కి ఎస్ఎంఎస్ పంపడం ద్వారా ఫాస్ట్ ట్యాగ్ బ్యాలెన్స్ ను  తెలుసుకోవచ్చని ఎస్బిఐ స్పష్టం చేసింది. ఇకపోతే దీనికోసం ఎస్బిఐ కస్టమర్లు తమ మొబైల్ నెంబర్ ను  బ్యాంకు వద్ద రిజిస్టర్ చేసుకొని ఉండాలి అని కూడా తెలిపింది. ఇకపోతే టోల్ గేట్ల వద్ద వాహనదారుల సమయం వృధా కాకుండా వారి సేవింగ్స్ అకౌంట్ నుంచి నేరుగా నగదు కట్టే విధంగా కేంద్ర ప్రభుత్వం ఫాస్ట్ ట్యాగ్ సర్వీస్ లను తీసుకొచ్చిన విషయం తెలిసిందే.  ఇకపోతే మీ వాహనంలో ఇన్స్టాల్ చేసిన ఫాస్ట్ ట్యాగ్ బ్యాలెన్స్ వివరాలు మీరు FTBAL అని వ్రాసి.. 72 08820019 నెంబర్ కు మెసేజ్ పంపితే చాలు క్షణాల్లో స్క్రీన్ పై ఎంత బ్యాలెన్స్ ఉందో తెలిసిపోతుంది.


ఇక ఇప్పటికే ఎంతోమంది ఈ సేవను వినియోగించుకునే ప్రయత్నం చేస్తున్నారు.  మీరు కూడా ఎస్బిఐ కస్టమర్ అయితే ఫాస్ట్ ట్యాగ్ ను మీరు ఉపయోగిస్తున్నట్లయితే వెంటనే ఈ సేవను పొందవచ్చు.  క్షణాల్లో బ్యాలెన్స్ ఎంత ఉందో తెలుసుకునే అవకాశం ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: