ఆ పోస్ట్ ఆఫీస్ లో ఇప్పుడు రకరకాల పథకాలు అందుబాటులోకి వస్తున్న విషయం అందరికీ తెలిసిందే.  అయితే వివిధ రకాల పథకాలలో ఇన్వెస్ట్మెంట్ చేసే వారికి కూడా మంచి లాభాలు కూడా లభిస్తున్నాయి. ముఖ్యంగా తక్కువ మొత్తంలో ఎక్కువ రాబడి వచ్చే విధంగా కేంద్ర ప్రభుత్వం కూడా కొన్ని పథకాలను పోస్ట్ ఆఫీస్ ద్వారా కస్టమర్లకు అందిస్తోంది. ఇక మీరు కూడా రాబోయే రోజుల్లో పెట్టుబడి పెట్టాలని ఆలోచిస్తున్నట్లయితే పోస్ట్ ఆఫీస్ లోని చిన్న పొదుపు పథకాల ద్వారా పెట్టుబడి పెట్టి అధిక మొత్తాన్ని సొంతం చేసుకోవచ్చు. ఇకపోతే ఇందులో జమ చేసిన మొత్తానికి ప్రభుత్వం సావరిన్ గ్యారెంటీ ఉన్నందున ఇందులో పెట్టుబడి పెడితే బ్యాంకుల కంటే ఎక్కువ సురక్షితంగా ఉంటుంది.

పోస్ట్ ఆఫీస్ ప్రవేశపెట్టిన పథకాలలో కిసాన్ వికాస్ పత్రా కూడా ఒకటి. ఈ పథకంలో పెట్టుబడి పెట్టడం వల్ల పది సంవత్సరాలా నాలుగు నెలల్లో మీ డబ్బు రెట్టింపు అవుతుంది.  వడ్డీ రేటు కూడా అధికంగా ఉంది. ప్రస్తుతం కిసాన్ వికాస్ పత్ర పథకంలో 6.9% వడ్డీ రేటు సంవత్సరానికి లభిస్తోంది. ఈ పథకంలో డిపాజిట్ చేసిన మొత్తం 124 నెలల్లో రెట్టింపు అవుతుంది. ఇక కనిష్టంగా ఇందులో 1000 రూపాయలను ఇన్వెస్ట్ చేయాలి. ఇక గరిష్టంగా ఎటువంటి పరిమితి లేదు. అంతేకాదు ఈ పథకంలో ఒక వ్యక్తి ఎన్ని ఖాతాలు అయినా సరే తెరిచే అవకాశం ఉంటుంది. 10 సంవత్సరాల కంటే ఎక్కువ వయసు ఉన్న మైనర్ ఎవరైనా సరే తన పేరు మీద ఈ ఖాతాను తెరవచ్చు.

వయోపరిమితి కేవలం కనిష్టంగా 10 సంవత్సరాలు మాత్రమే ఉండాలి. తక్కువ పెట్టుబడితో ఎక్కువ రాబడిని ఇచ్చే విధంగా కేంద్ర ప్రభుత్వం ఇలాంటి పథకాలను అందిస్తోంది. మీరు కూడా ఒకేసారి పెట్టుబడి పెట్టి నిర్ణీత సమయం ముగిసిన తర్వాత రెట్టింపు స్థాయిలో మీ డబ్బును పొందడమే కాదు వడ్డీతో కలిపి ఎక్కువ మొత్తంలో పొందవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: