ఊహించినట్టుగానే తాజాగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లోన్ లపై వడ్డీ రేట్లపై కీలక నిర్ణయం తీసుకుంది. మూడు రోజులగా జరుగుతున్న ఆర్బిఐ ద్రవ్య విధానం కమిటీ సమీక్షా సమావేశంలో ఇలా కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇక రేపో రేటును మరో 50 బేసిస్ పాయింట్స్ కూడా పెంచింది. ఇకపోతే ఏకంగా 5.90 శాతానికి రెపో రేటు పెరిగిందని చెప్పవచ్చు. గత నెలలో కూడా 50 బేసిస్ పాయింట్స్ పెరిగిన విషయం తెలిసిందే.. ఇప్పుడు కూడా వడ్డీ రేటు 50 బేసిస్ పాయింట్స్ పెరగడం గమనార్హం. 100 బేసిస్ పాయింట్స్ ఒక శాతంతో సమానం అంటే ప్రస్తుతం అరశాతం వడ్డీ పెరిగింది అన్నమాట .


 ఇక కరోనా మహమ్మారి కారణంగా ఆర్బిఐ రెండేళ్లపాటు వడ్డీరేట్లు స్థిరంగా ఉంచింది.  అంతకన్నా ముందు వడ్డీరేట్లు భారీగా తగ్గించింది. ఇటీవల ద్రవ్యోల్బణం భారీగా పెరగడంతో వడ్డీ రేట్లు పెంచాలని కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇక మే నాల్గవ తేదీన 40 బేసిస్ పాయింట్స్, జూన్ 8వ తేదీన 50 బేసిస్ పాయింట్స్ అలాగే ఆగస్టు 5న 50 బేసిస్ పాయింట్స్ వడ్డీ రేటు పెంచిన విషయం తెలిసిందే..


ప్రస్తుతం  మరో 50 బేసిస్ పాయింట్స్ వడ్డీ రేటు పెరిగింది.  దీంతో ఐదు నెలల్లో మొత్తం 190 బేసిస్ పాయింట్స్ అంటే 1.90  శాతం వడ్డీ రేటు పెరిగింది. ఇకపోతే ఆర్బిఐ వడ్డీ రేట్లు పెంచాలా? తగ్గించాలా? స్థిరంగా ఉంచాలని నిర్ణయాన్ని ద్రవ్య విధాన కమిటీ సమీక్ష సమావేశంలో తీసుకుంటుంది. ఇకపోతే ఆర్బిఐ బ్యాంకులకు ఇచ్చే రుణాలకు వసూలు చేసే వడ్డీని రెపో రేట్ అంటారు . బ్యాంకులో ఇచ్చే రుణాల పై  వడ్డీ రేట్లు కూడా పెరుగుతాయి ఎక్కువగా పడుతుంది. హోమ్ లోన్,  పర్సనల్ లోన్ ఇతర రుణాల వడ్డీ రేట్లు కూడా పెరుగుతాయి . ఫలితంగా కస్టమర్లకు ఈ.ఎమ్.ఐ లు భారం అవుతాయని చెప్పవచ్చు

మరింత సమాచారం తెలుసుకోండి: